
కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది అమెరికా సైనికులు సహా 72 మంది మృతిచెందారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. దాడులకు పాల్పడినవారు ఇంతకు ఇంతా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ‘మేము ఎవ్వర్నీ క్షమించం.. ఏదీ మరిచిపోం.. మేము వేటాడి పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాం’ అని బైడెన్ అన్నారు. కాబూల్ ఆత్మాహుతి దాడులపై శ్వేతసౌధం నుంచి ప్రసంగించిన జో బైడెన్.. అఫ్గన్ నుంచి తరలింపు కొనసాగుతుందని తెలిపారు. దాడుల వెనుక తాలిబన్లు, ఐఎస్ ఉగ్రవాదుల కుట్ర సంకేతాలు లేవని అన్నారు. ‘అఫ్గన్‌స్థాన్ విషయంలో అమెరికా దళాలతో ఖచ్చితత్వంతో స్పందిస్తుంది.. అఫ్గనిస్థాన్ నుంచి అమెరికా పౌరులను సురక్షితంగా తీసుకొస్తాం.. మేము మా అఫ్గన్ మిత్రులను బయటకు తీస్తాం.. మా మెషిన్ కొనసాగుతుంది.. అఫ్గనిస్థాన్ భూభాగం నుంచి అమెరికా దళాలను ఉపసంహరణకు తాలిబన్లతో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పందం చేసుకున్నారు.. కానీ తాలిబన్లు ఇతర దేశాలపై దాడిచేస్తూనే ఉన్నారు.. అమెరికాపైనే కాదు’ అన్నారు. ఇప్పటి వరకూ లక్ష మందిని అఫ్గన్ నుంచి తరలించామని, దళాల ఉపసంహరణకు ఆగస్టు 31 తుది గడువని మరోసారి బైడెన్ గుర్తుచేశారు. కాబూల్ విమానాశ్రయం వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారి గౌరవార్ధం సంతాప సూచికగా అధ్యక్షభవనం వైట్‌హౌస్, సైనిక, నౌకదళ, వైమానిక స్థావరాలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమెరికా జాతీయ పతాకాన్ని ఆగస్టు 30 వరకు అవనతం చేయాలని జో బైడెన్ సూచించారు. అఫ్గనిస్థాన్‌లో 2001 నుంచి జరిగిన సుదీర్ఘ యుద్ధంలో ఇప్పటి వరకూ 2,300 మంది సైనికులు అమరులయ్యారు... 20 వేల మందికిపైగా గాయపడ్డారు.. 8 లక్షల మందికిపైగా సేవలందించారు.. ఈ యుద్ధంలో వీరితోపాటు అమెరికా పౌరులు చనిపోవడం లేదా క్షతగాత్రులయ్యారు అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకేన్ తెలిపారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3gz1wYc
No comments:
Post a Comment