850 మందికిపైగా పార్లమెంట్‌ సిబ్బందికి కోవిడ్

పార్లమెంట్‌లో మళ్లీ కరోనా కలకలం నెలకొంది. అక్కడ 850కి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 250 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. కేసులు పెరగడంతో పార్లమెంట్ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎలాంటి లక్షణాలు లేని వారు మాత్రమే విధులకు హాజరు కావాలని సిబ్బందిని ఆదేశించారు. స్వల్ప లక్షణాలున్నా విధులకు రావొద్దని, అవసరమైతే ఇంటి నుంచే వర్క్ చేయాలని సూచించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు రెండు విభాగాలుగా ఉద్యోగులను విధులకు హాజరు కావాలని చెప్పినట్టు సమాచారం. కాగా జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం అధికారులు అక్కడ అన్ని ఏర్పాట్టు చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. సమావేశాల్లో భాగంగా మొదటి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఉండగా... ఫిబ్రవరి 1ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్‌‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా దేశంలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే దేశంలో 2.71 లక్షలకుపైగా నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళలో పాజిటివ్ కేసులు అత్యధికంగా రిజిస్టర్ అవుతున్నాయి. కేసులతోపాటు మరణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో రాష్ట్రాల్లో కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. కఠిన నిబంధనలు అమలు చేస్తోన్నాయి. కానీ కోవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3FB9E3Q

Post a Comment

0 Comments