Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 March 2021

శరద్ పవార్‌కు ఏమైంది.. ఉన్నట్టుండి అస్వస్థత.. ఎల్లుండి సర్జరీ

ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పవార్‌కు ఆదివారం పొత్తికడుపులో నొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేశారు. ఆయనకు గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మార్చి 31న పవార్‌కు బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్టు ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. శరద్ పవార్ ఆరోగ్యం కుదుటపడే వరకూ అన్ని కార్యక్రమాలన్నీ రద్దు చేసినట్టు ఆయన వివరించారు. ‘శనివారం సాయంత్రం కడుపులో నొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు.. గాల్ బ్లాడర్‌‌లో స్టోన్స్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.. రక్తం పలుచబడటానికి పవార్ ప్రస్తుతం ఔషధాలు తీసుకుంటున్నారు.. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటంతో వాటిని ప్రస్తుతం నిలిపివేశారు.. మార్చి 31న ఎండోస్కొపీ సర్జరీ నిర్వహించనున్నారు.. ఆయన కోలుకునే వరకూ అన్ని కార్యక్రమాలను రద్దుచేశాం’ అని తెలిపారు. గతంలో నోటి కేన్సర్ బారిపడి కోలుకున్న శరద్ పవార్‌కు 2004లో సర్జరీ జరిగింది. తన ఆరోగ్యం గురించి కేంద్ర మంత్రి హర్ష్‌వర్దన్ ఫోన్ చేసి యోగక్షేమాలను తెలుసుకున్నట్టు పవార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మహారాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎన్సీపీ అధినేత పవార్ రహస్యం భేటీ అయిన తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. ముకేశ్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసు చినిచినికి గాలివానలా మారి మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంపై పెద్ద బాంబు పేల్చింది. ఈ కేసు విచారణ కొనసాగుతుండగా.. ముంబయి నగర పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌ను బదిలీ చేశారు. తననను బదిలీచేయడంతో కలతచెందిన పరంబీర్.. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సంచలన ఆరోపణలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖరాయడం రాజకీయ ప్రకంపనలు రేపింది. ప్రతిపక్ష బీజేపీ చేతికి ఆయన పెద్ద అస్త్రానిచ్చినట్టయ్యింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31twb12

No comments:

Post a Comment