కాశీ విశ్వనాథ్ ఆలయ సిబ్బందికి జ్యూట్ చెప్పులు పంపించిన ప్రధాని

కాశీ విశ్వనాథ్ కారిడార్ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అప్పుడు వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్‌లో చాలా సేపు గడిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి సేవకులతో కలసి భోజనాలు కూడా చేశారు. అయితే అక్కడ అర్చకులు, , సెక్యూరిటీ గార్డులు లేకుండా తిరగడాన్ని ప్రధాని గమనించారు. గడ్డకట్టే చలిలో కాళ్లకు ఎలాంటి రక్షణ లేకుండా ఉండడాన్ని ఆయన గుర్తించారు. దాని గురించి అడగగా ఆలయ పరిసర ప్రాంతాల్లో చర్మం, రబ్బరుతో తయారు చేసిన చెప్పులను ధరించడాన్ని నిషేధించినట్టు ఆలయ అధికారులు చెప్పారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని.. ప్రధాని ఆ సిబ్బందికి పాదరక్షలను పంపించారు. జ్యూట్‌తో తయారు చేసిన వంద జతల చెప్పులను వారికి అందించారు. ఆ చెప్పులు జనపనారతో తయారు చేసినవి కావడం వల్ల ఆలయ ప్రాంగణంలో అర్చకులు, కార్మికులు, సిబ్బంది.. వాటిని ధరించడానికి వెసులుబాటు కలిగింది. గుర్తుపెట్టుకుని ప్రధాని తమకు పాదరక్షలను పంపండంపై కాశీ విశ్వనాథ్ ధామ్ పూజారులు, సిబ్బంది, సేవకులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా గతేడాది వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధాని పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగానే రూ. 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడర్‌‌ను ప్రారంభించారు. ఆలయాన్ని 1780లో మహారాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. 19వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ దీనిని బంగారు శిఖర్‌తో పట్టాభిషేకం చేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3qaKipb

Post a Comment

0 Comments