దండన పేరుతో దారుణం.. నగ్నంగా కూర్చోబెట్టిన ప్రిన్సిపాల్

విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే… కర్కశంగా ప్రవర్తించింది. ఓ విద్యార్థినిని విచక్షణా రహితంగా కొట్టింది. ఫోన్ తీసుకొచ్చిందనే కోపంతో చితకబాది.. అతి దారుణంగా శిక్షించింది. కర్ణాటకలోని మాండ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీరంగ పట్టణం తాలూకాలోని గణంగూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న క్లాస్‌రూమ్‌కు మొబైల్ ఫోన్ తీసుకెళ్లింది. ఆ విషయాన్ని తెలుసుకున్న ప్రధానోపాధ్యాయురాలు స్నేహలత అందరి ముందు ఆ విద్యార్థిని కర్రతో కొట్టింది. అంతేకాదు విద్యార్థిని విప్పమని బలవంతం చేసింది.. ఒక వేళ విప్పనంటే అబ్బాయిలతో విప్పిస్తానని బెదిరించింది. కొంత సమయం తర్వాత అబ్బాయిలను బయటకు పంపించి.. దుస్తులు విప్పించి కింద కూర్చోబెట్టింది. కనీసం మధ్యాహ్నం భోజనం కూడా చేయనివ్వకుండా సాయంత్రం వరకు అలాగే ఉంచింది. 4.30 గంటలకు విద్యార్థిని అన్నం తినేందుకు అనుమతించింది. సాయంత్రం ఐదు గంటలకు విద్యార్థిని ఇంటికి వెళ్లింది. తర్వాత బాధితురాలు తమ కుటుంబంతో జరిగిన విషయాన్ని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో జరిగిన సంఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై తహసీల్దార్ శ్వేత ఎన్.రవీంద్ర ఇప్పటికే పాఠశాలను సందర్శించి సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. కాగా సదరు హెడ్‌మాస్టర్ గతంలో సస్పెన్షన్‌కు గురైంది. ఇంతకు ముందు కూడా దండన పేరుతో విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టిందనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3F37lGK

Post a Comment

0 Comments