మాజీ ఉద్యోగి నేర చరిత్రకు సంబంధించిన సమాచారం నమోదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అమెరికా వాయుసేనపై స్థానిక ఫెడరల్ కోర్టు తీవ్రంగా మండిపడింది. తత్ఫలితంగా 2017 టెక్సాస్‌లో 22 మంది మృతికి కారణమైన కాల్పుల ఘటనకు ప్రభుత్వానిదే 60 శాతం బాధ్యతని స్పష్టం చేసింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రూ.1718 కోట్ల (230 మిలియన్ డాలర్లు)కు పైగా పరిహారం చెల్లించాలని ఎయిర్‌ఫోర్స్‌ను ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన మాజీ ఎయిర్‌మెన్ డెవిన్ పాట్రిక్ కెల్లీ.. 2017 నవంబరు 5న టెక్సాస్‌లోని ఓ చర్చిలో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 22 మంది గాయపడ్డారు. అనంతరం కెల్లీ తనను తాను కాల్చుకుని చనిపోయాడు. టెక్సాస్ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన సామూహిక కాల్పుల ఘటన. కానీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్నప్పుడే 2012లో కెల్లీపై వచ్చిన గృహ హింస ఆరోపణలు రుజువయ్యాయి. అతను మానసిక సమస్యలతోనూ బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. దుష్ర్పవర్తన కారణంగా ఐదేళ్ల ముందే 2014లో అతడ్ని విధుల నుంచి తొలగించారు. దీంతో అమెరికా చట్టాల ప్రకారం కెల్లీకి చట్టబద్ధంగా ఆయుధాల కోనుగోలుకు అనుమతి లేదు. కానీ అతడి నేర చరిత్రను నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో అతడికి చట్టబద్ధంగానే ఆయుధాల కొనుగోలుకు అవకాశం లభించింది. తుపాకిని కొనుగోలు చేసి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత కుటుంబాలు కోర్టును ఆశ్రయించి.. అమెరికా ప్రభుత్వంపై దావా వేశాయి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన టెక్సాస్‌లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జేవియర్ రోడ్రిగ్జ్.. ఈ ఘటనకు కెల్లీది 40 శాతం, ప్రభుత్వానికి 60 శాతం బాధ్యతని తేల్చిచెప్పారు. మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి 230 మిలియన్ పరిహారం చెల్లించాలని ఆదేశించారు. బాధితుల తరఫున వాదించిన న్యాయవాదుల్లో ఒకరైన జమాల్ అల్సఫర్ మాట్లాడుతూ.. ఈ తీర్పుతో కుటుంబాలు ఉపశమనం లభించిందని అన్నారు. ‘హింసకు కొంత జవాబుదారీతనం ఉందని గుర్తించే న్యాయమూర్తి వారికి నిజంగా చాలా ముఖ్యం’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని భావిస్తున్నట్టు వాయుసే ప్రతినిధి ఆన్ స్టెఫానెక్ చెప్పారు. ‘మాకు కోర్టు జరిమానా విధించడం తెలుసు.. న్యాయమూర్తి తీర్పును సమీక్షిస్తున్నాం’ అని ఆమె చెప్పారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/r4dR2QN
0 Comments