సౌర తుఫాను ఎఫెక్ట్: కక్ష్య నుంచి తప్పి కూలిపోయిన 40 స్పేస్ఎక్స్ ఉపగ్రహాలు

అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ సంస్థ ప్రయోగించిన కక్ష్యలో నుంచి జారిపడి భూమిపై కుప్పకూలాయి. ఇంటర్నెట్‌ అవసరాల కోసం స్టార్‌ లింక్‌ ప్రాజెక్టులో భాగంగా ఇటీవల మొత్తం 49 ఉపగ్రహాలను స్పేస్‌ఎక్స్ ప్రయోగించింది. గత శుక్రవారం శక్తివంతమైన తాకడంతో వీటిలో 40 ఉపగ్రహాలు కక్ష్యను తప్పాయి. ఇందులో కొన్ని భూవాతావరణంలోకి ప్రవేశించి కుప్పకూలినట్టు ప్రముఖ స్పేస్‌ జర్నలిస్టు జొనాథన్‌ కల్లిఘాన్‌ ట్వీట్‌ చేశారు. ఈ దృశ్యాలను ప్యూర్టో రికోకు చెందిన ఆస్ట్రోనోమియా డెల్‌ కెర్బీ అనే సంస్థ చిత్రీకరించింది. సౌర తుఫాను ప్రభావంతో భారీ సంఖ్యలో ఉపగ్రహాలు గతి తప్పిన ఘటన ఇదే కావచ్చని హార్వర్డ్ స్మిత్సోనియన్‌ ఖగోళ శాస్త్రవేత్త జోనాథన్‌ మెక్‌డోవెల్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై అధికారిక వెబ్‌సైట్‌లో స్పందించిన స్పేస్‌ఎక్స్‌.. ఉపగ్రహాలను ప్రయోగించిన మర్నాడే సౌర తుఫాను ప్రభావానికి గురైనట్లు వెల్లడించింది. అయితే, దీని వల్ల స్టార్‌ లింక్‌ ప్రాజెక్టుకు పెద్దగా ప్రమాదంలేదని వెల్లడించింది. ప్రయోగ ఖర్చుతో సహా కలిపి మొత్తం 100 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా. వాస్తవానికి స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌ రాకెట్‌ను ప్రయోగించడానికి ముందే అమెరికా అంతరిక్ష వాతావరణ అంచనా కేంద్రం హెచ్చరించింది. ఫిబ్రవరి 2-3 తేదీల్లో సౌర తుఫాను ఉండే అవకాశం ఉందని గతంలోనే హెచ్చరించిన విషయం తెలిసిందే. ‘‘గత శుక్రవారం సంభవించిన సౌర తుఫాను స్టార్‌లింక్ ఉపగ్రహాలపై ప్రభావం చూపి, వాటిని సమర్ధతను నాశనం చేసింది. ఈ ఉపగ్రహాలను ఒక రకమైన హైబర్నేషన్‌లో ఉంచడం ద్వారా సురక్షితంగా ఉంచడానికి గ్రౌండ్ కంట్రోలర్‌లు ప్రయత్నించారు.. కానీ వాతావరణం అందుకు అనుకూలించకపోవడంతో ఉపగ్రహాలు స్థిరమైన కక్ష్యలోకి చేరడంలో విఫలమయ్యాయి’’ అని పేర్కొంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/djnTGxE

Post a Comment

0 Comments