దేశంలో కరోనా కేసుల్లో భారీ తగ్గుదల నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే రోజువారీ కేసుల్లో భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 84 వేల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. దీంతో జనవరి 5 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్ష దిగువన నిర్ధారణ అయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 11,56,363 పరీక్షలు నిర్వహించగా.. 83,876 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొత్త కేసులు తగ్గుతున్నా మరణాలు మాత్రం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా నిన్న 895 మంది కరోనాతో కన్నుమూశారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాలు 5,02,874గా ఉన్నాయి. ఇక, కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య రెట్టింపుగా ఉంది. 1,99,054 మంది కరోనా నుంచి కోలుకోగా.. దేశంలో రికవరీ రేటు 96.19 శాతంగా ఉంది. మహమ్మారి నుంచి కోలుకున్నవారి సంఖ్య 4,06,60,202కి చేరింది. ఇక, రోజువారీ పాజిటివిటీ రేటు 7.25 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2.62 శాతంగా ఉన్నాయని పేర్కొంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,08,938కు పడిపోయాయి. అలాగే, గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 14,70,053టీకా డోసులను పంపిణీ చేశారు. దీంతో దేశంలో 1,69,63,80,755 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటి వరకూ అత్యధికంగా ఆ రాష్ట్రంలో రోజువారీ కేసులు బయటపడ్డాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/cKJ1kvm
0 Comments