
సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని శ్రీ గురు రవిదాస్ విశ్రామ్ ధామ్ మందిర్‌కు వెళ్లారు. అక్కడ ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురు రవిదాస్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆలయంలో భక్తులతో కలిసి ప్రార్థనలు చేశారు. వారితో షాబాద్ కీర్తనలో పాల్గొన్నారు. సంప్రదాయ వాయిద్య పరికరాన్ని చేతిలో పట్టుకుని భక్తులతో పాటు ప్రధాని కూడా కీర్తనలను ఆలపించారు. మందిరానికి వెళ్లే ముందు సమాజంలోని దురాచారాల నిర్మూళనకు తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ రవిదాస్‌ను కొనియాడారు. దేవాలయంలో ప్రజల సంక్షేమం కోసం ప్రార్థనలు చేస్తానని ప్రధాని చెప్పారు. గురు రవిదాస్ స్ఫూర్తితోనే తన ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తోందని, ప్రతి పథకం చేపడుతుందని ఆయన ట్వీట్ చేశారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ మాసంలో పౌర్ణమి రోజున మాఘ పూర్ణిమ నాడు గురు రవిదాస్ జయంతిని జరుపుకుంటారు. ఆయన 14వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని సీర్ గోవర్ధన్‌పూర్ గ్రామంలో జన్మించారు. రవిదాస్ 15 నుంచి 16వ శతాబ్దపు భక్తి ఉద్యమానికి చెందిన వ్యక్తి. అతని శ్లోకాలను గురు గ్రంథ్ సాహిబ్‌లో పొందుపరిచారు. పంజాబ్‌లో గురు రవిదాస్ జయంతిని ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ జయంతి కారణంగానే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సైతం వాయిదా పడ్డాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/PErV1a5
No comments:
Post a Comment