ఉక్రెయిన్, రష్యాల మధ్య ఏర్పడిన యుద్ద మేఘాలు వీడుతున్నాయి. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. అమెరికా, నాటో కూటమితో చర్చలకు రెడీగా ఉన్నామని ప్రకటించారు. పశ్చిమ దేశాల దౌత్యంతో రష్యా వెనక్కి తగ్గింది. దౌత్య ప్రయత్నాల్లో భాగంగా మంగళవారం మాస్కో వచ్చిన జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో చర్చల అనంతరం పుతిన్ మాట్లాడారు. ఉక్రెయిన్‌తో వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు చర్చలకు సిద్ధమని ప్రకటించారు. సరిహద్దుల నుంచి రష్యా తమ బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత పుతిన్ ఈ ప్రకటన చేశారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అలాగే దీనిని చైనా అవకాశం తీసుకుంటుందనే అనుమానాలను అమెరికా జనరల్ వ్యక్తం చేశారు. కాగా ఉక్రెయిన్‌పై దాడికి ఉవ్విళ్లూరిన రష్యాపై అన్ని దేశాలు మండిపడ్డాయి. ఇప్పటికే ఈ విషయంలో అమెరికా .. రష్యాను హెచ్చరించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రష్యాను దాడికి దిగొద్దని వారించారు. ఒక వేళ ఉక్రెయిన్‌పై దాడి చేస్తే లండన్‌లోని రష్యా కంపెనీలపై ఆంక్షలు పెడతామని, అవసరమైతే మూసేస్తామని హెచ్చరించారు. ఉక్రెయిన్ దాడి విషయంలో అమెరికా కూడా రష్యాకు వార్నింగ్ ఇచ్చింది. దాడికి పాల్పడితే అత్యంత ముఖ్యమైన నార్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైన్‌ను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యూఎస్ సెనేటర్లు ఉక్రెయిన్ ప్రజలకు తమ సంఘీభావాన్ని తెలిపారు. ఇలా సంక్షోభ సమయంలో అండగా ఉంటామని అక్కడ ప్రజలకు తెలిపారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/mOlSMwn
0 Comments