ముందు ట్వీట్‌లో తప్పులు చూసుకోండి అంటూ… ఎంపీకి కేంద్ర మంత్రి క్లాస్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అడ్డంగా దొరికిపోయారు. కేంద్రాన్ని విమర్శిస్తూ చేసిన ట్వీట్లలో అక్షర దోషాల కారణంగా ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. లోక్‌సభలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై మాట్లాడారు. మంత్రి సీతారామన్ ప్రసంగంపై స్పందిస్తూ ఎంపీ శశిథరూర్ ఓ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థపై మంత్రి చేసిన ప్రసంగాన్ని ట్రెజరీ బెంచీలు కూడా నమ్మలేకపోతున్నాయని, కావాలంటే మొహంలో ఎక్స్‌ప్రెష‌న్‌ను చూడ‌వ‌చ్చు అంటూ పేర్కొన్నారు. అయితే ఆ ట్వీట్‌లో Budgetకి బదులుగా Bydget అని, replyకి బదులుగా rely అని రాశారు. దీనిపై కేంద్ర మంత్రి రాందాస్ అత్‌వాలే కౌంటర్ ఇచ్చారు. ఆరోపణలు చేసే ముందు తప్పులను సరి చేసుకుంటే బాగుంటుందని, అనవసరమైన కామెంట్లు చేసేవాళ్లు పొరపాట్లు చేస్తుంటారని ఆయన అన్నారు. దీనిపై శశిథరూర్ వెంటనే ప్రతిస్పందించారు. తన తప్పులను ఒప్పుకుంటూ వచ్చిరాని ఇంగ్లీష్ కన్నా టైపింగ్ తప్పులు చాలా ఘోరం అని థరూర్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. 2022-23 బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం కాంగ్రెస్ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో దేశం అంధకారంలోకి వెళ్లిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రోజుకో స్కామ్ గురించి కథనాలు వచ్చేవని ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దేశంలో మంచి రోజులు వచ్చాయని ప్రశంసించారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/A85jkZz

Post a Comment

0 Comments