తమిళనాడులో బీజేపీ కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తి విసరడం కలకలం రేగుతోంది. చెన్నైలోని బీజేపీ కార్యాలయంపైకి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో దుండుగుడు పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ ఘటన వెనుక అధికార హస్తం ఉందని, పదిహేనేళ్ల కిందట ఈ విధంగానే జరిగిందన తమిళనాడు బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బాంబు దాడి గురించి బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. ‘‘మా కార్యాలయంపైకి తెల్లవారుజామున 1.30 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి పెట్రోల్ బాంబు విసిరాడు.. డీఎంకే ప్రమేయంతో పదిహేనేళ్ల కిందట ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది.. ఈ ఘటనలో తమిళనాడు ప్రభుత్వ పాత్ర ఉంది.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం... ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం.. బీజేపీ కార్యకర్తలు ఇటువంటి చర్యలకు భయపడరు’’ అని ఆ పార్టీ నేత కరాటే త్యాగరాజన్ అన్నారు. బీజేపీ నేతల ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడ్ని గుర్తించడానికి ఘటన జరిగిన ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. అయితే, తెల్లవారుజామున ఈ ఘటన జరగడం, ఆ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడిలో ఎవ్వరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు, పెట్రోల్ బాంబు దాడి గురించి తెలిసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు గురువారం ఉదయం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/aVvcjT2
0 Comments