డేరా బాబాకు తొలిసారి జైలును వీడే అవకాశం లభించింది. హర్యాణాకు చెందిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీం ఓ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రస్తుతం రోహతక్‌లోని సునారియా జైలులో ఉన్నారు. అయితే మొట్టమొదటి సారిగా ఆయన జైలు నుంచి బయటకు రావడానికి పర్మిషన్ వచ్చింది. ఈ మేరకు ఆయన 21 రోజులుపాటు బయట ఉండేందుకు అనుమతి లభించింది. దీంతో ఆయన సోమవారం జైలు నుంచి బయటకు రానున్నట్టు తెలుస్తుంది. డేరా బాబాపై అనే లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. 2002లో తన మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు. అలాగే ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో కూడా ఆయన దోషిగా ఉన్నారు. కొన్నేళ్లుగా జైల్లో ఉంటున్న ఆయనకు ప్రభుత్వం మొదటిసారిగా ఫర్‌లాఫ్ మంజూరు చేసింది. దీంతో మూడు వారాల పాటు జైలు బయటే ఉంటారని జైలు అధికారులు తెలిపారు. అయితే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుర్మీత్ రాం రహీం విడుదల చర్చనీయాంశం అయింది. ఆయన రాకతో పంజాబ్ ఎన్నికలపై ప్రభావం పడుతుందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై హర్యాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టార్ స్పందించారు. ఎన్నికలకు, డేరాబాబా బయటకు రావడానికి ఎలాంటి సంబంధం లేదని, చట్టం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే ప్రతి ఖైదీకి కొన్ని రోజులు ఇలా బయటకు వచ్చే అవకాశం ఉంటుందని, అది ఖైదీల హక్కు అని హర్యాణా మంత్రి రంజిత్ సింగ్ చౌతలా కూడా అన్నారు. అదే చట్టం డేరా బాబాకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. గతంలో కూడా డేరాబాబాకు అత్యవసర పెరోల్‌పై ఇచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి ఆయనకు పెరోల్ ఇచ్చారు.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/bE8egG2
0 Comments