Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 February 2022

Russia Invasion ఉక్రెయిన్ సంక్షోభానికి 30 ఏళ్ల నాటి ఆ మూలాలే కారణం: భారత్ కీలక వ్యాాఖ్యలు

ఉక్రెయిన్‌‌ను మూడు ముక్కలు చేసిన రష్యా.. వేర్పాటువాదుల అధీనంలో ఉన్న డొనెట్స్క్‌, లుహాన్స్క్‌లను స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించింది. దీంతో రష్యాపై అగ్గిమీదు గుగ్గిలమవుతున్న పశ్చిమ దేశాలు.. ఆంక్షలు విధిస్తున్నాయి. రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ భిన్నంగా స్పందించింది. ఉక్రెయిన్‌ సంక్షోభానికి సోవియట్ విచ్ఛిన్నం అనంతర రాజకీయాలు, నాటో విస్తరణ, రష్యా- ఐరోపా మధ్య విభేదాలతో సంబంధం ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. పారిస్‌లోని ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచం బహుళ సంక్షోభాల మధ్యలో ఉందని, తాజా పరిణామాలు అంతర్జాతీయ క్రమంలో కొత్త సవాళ్లను సృష్టించాయని అన్నారు. ‘‘ఉక్రెయిన్‌ సంక్షోభం గత 30 సంవత్సరాలలో సంక్లిష్ట పరిస్థితుల ఫలితం.. భారత్, ఫ్రాన్స్ వంటి చాలా దేశాలు దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుతున్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైన్యాలను మోహరించడాన్ని భారత్ ఎందుకు ఖండించడం లేదన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘అసలు సమస్య ఏమిటంటే.. మంచి పరిష్కారాన్ని కనుగొనడానికి చేసిన ప్రయత్నాలతో సంతృప్తి చెందారా? ఐరాస భద్రతా మండలిలో రష్యా, ఇతర దేశాలతో భారత్ మాట్లాడుతోంది.. ఫ్రాన్స్ వంటి దేశాల చర్యలకు మద్దతు ఇస్తుంది’’అని అన్నారు. వేగంగా విస్తరిస్తున్న ఇండో-ఫ్రెంచ్ సంబంధాల గురించి ప్రస్తావించిన ఆయన.. సముద్రగర్భం నుంచి అంతరిక్షం వరకు, సైబర్ నుంచి మహాసముద్రాల వరకు అనేక భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఫ్రాన్స్‌ను విశ్వసనీయ భాగస్వామిగా భారత్ చూస్తోందని చెప్పారు. ‘‘75 ఏళ్ల కిందట స్వతంత్ర దేశంగా మన ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పుడు ఇండో-ఫ్రెంచ్ సంబంధాలు అత్యంత బలమైనవని నేను నిజమైన విశ్వాసంతో చెప్పగలను’’ అని అన్నారు. ‘‘ఫ్రాన్స్‌తో భారతదేశ సంబంధాలు స్థిరమైన, స్పష్టమైన మార్గంలో ముందుకు సాగుతూనే ఉన్నాయి.. ఇది మనం కొన్నిసార్లు ఇతర సందర్భాల్లో చూసే ఆకస్మిక మార్పులు, ఆశ్చర్యాలకు దూరంగా ఉండే సంబంధం.. ఫ్రాన్స్‌తో సంబంధాలపై భారత్ గొప్ప విశ్వాసం ఉంది.. 1998లో అణు పరీక్షల తర్వాత భారత్‌పై వ్యూహాత్మక నిర్బంధం గురించి ఫ్రాన్స్‌కు అవగాహన ఉంది.. పౌర అణుశక్తిలో అంతర్జాతీయ సహకారాన్ని పునఃప్రారంభించేందుకు 2008లో ఎన్ఎస్జీ నుంచి భారత్ మినహాయింపు పొందడంలో ఫ్రాన్స్ మద్దతు ముఖ్యమైన పాత్ర పోషించింది’’ అని అన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం, తైవాన్ పరిస్థితులతో పోల్చి చూడవచ్చా? అని ప్రశ్నించగా.. ఈ రెండు విభిన్నమైన సమస్యలని, వేర్వేరు చరిత్రలు, భిన్నమైన సందర్భాలు ఉన్నాయని చెప్పారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/8Zqup1Q

No comments:

Post a Comment