ఫేస్‌బుక్ యువతిని పరిచయం చేసుకుని లైంగికంగా అనుభవించిన తర్వాత పెళ్లికి మొహం చాటేసిన కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. కడపకు చెందిన ఓ యువతికి, పులివెందులకు చెందిన రూపసాగర్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఛాటింగ్‌తో మొదలైన వారి పరిచయం డేటింగ్ వరకు వెళ్లి హద్దులు దాటే స్థాయికి వెళ్లిపోయింది. యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రూపసాగర్ ఆమెను అనేక ప్రదేశాలకు తీసుకెళ్లి లైంగికంగా అనుభవించాడు. ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా ప్రియుడు మాయమాటలు చెప్పి తప్పించుకోవడంతో అనుమానం వచ్చిన యువతి అతడి ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో రూపసాగర్ ఆమెపై దాడిచేసి దుర్భాషలాడాడు. తనకు ఇంతకుముందే పెళ్లి అయిపోయందని, ఏం చేసుకుంటావో చేసుకోమని తేల్చి చెప్పేశాడు. దీంతో మనస్తాపం చెందిన బాధితురాలు మణికట్టు వద్ద బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. యువతి ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి ఆరా తీయగా బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పింది. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆదేశాలతో ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ ఎన్. సుధాకర్ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరచగా జడ్జి ఆగస్టు 2వ వరకు రిమాండ్ విధించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2XPAnJ4
No comments:
Post a Comment