భూమి తనఖా పెట్టి అప్పు తీసుకోవడమే ఆమె పాలిట శాపమైంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడం లేదన్న కోపంతో ఆమెను ట్రాక్టర్‌తో తొక్కించి దారుణంగా చంపేశాడో దుర్మార్గుడు. ఈ హృదయ విదారకమైన ఈ ఘటన జిల్లా శివాపురం తండాలో సోమవారం జరిగింది. శివారు శివాపురం తండాకు చెందిన రమావత్ మంత్య్రానాయక్, మంత్రుభాయి (55) దంపతులు అటవీ భూములను సాగు చేసుకుంటూ రెండున్నర ఎకరాల భూమిపై హక్కులు సాధించారు. సాగుతో పాటు ఇతర అవసరాల కోసం నర్సింగపాడుకు చెందిన బోనముక్కల శ్రీనివాసరెడ్డి వద్ద రెండేళ్ల క్రితం పొలం తాకట్టు పెట్టి రూ.3.80 లక్షల అప్పు తీసుకున్నారు. Also Read: అయితే సాగులో నష్టం రావడంతో ఆ దంపతులు సకాలంలో అప్పు తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీతో సహా తన అప్పు చెల్లించాలని శ్రీనివాసరెడ్డి కొంతకాలంగా వారిపై ఒత్తిడి తెస్తున్నాడు. దీనిపై కొద్దిరోజులుగా వారి మధ్య వివాదం కొనసాగుతోంది. అప్పు తీర్చకపోతే తనఖా పెట్టిన భూమిని స్వాధీనం చేసుకుంటానని శ్రీనివాసరెడ్డి బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలోనే సోమవారం మంత్య్రానాయక్, మంత్రుభాయి పొలానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని తెలుసుకున్న అతడు ట్రాక్టర్‌తో గ్రామానికి వచ్చాడు. Also Read: అప్పు చెల్లించకుండా పొలంలో కాలు పెడితే ఊరుకోనని తెగేసి చెప్పాడు. అయితే తమకు పొలమే జీవనాధారమని, సాగు చేసుకుంటూ నెమ్మదిగా అప్పు తీర్చేస్తామని ఆ దంపతులు వేడుకున్నా అతడు కనికరించలేదు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం పెరిగడంతో కోపోద్రిక్తుడైన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్‌తో మంత్రుభాయిను తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దీంతో కంగారుపడిన నిందితుడు ట్రాక్టర్‌తో సహా పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3grPihS
No comments:
Post a Comment