కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 నిబంధనలను మరోసారి పొడిగించింది. మార్చి 31 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర హోం శాఖ శుక్రవారం (ఫిబ్రవరి 26) ప్రకటించింది. కొవిడ్-19 తీవ్రత తగ్గకపోగా, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. ఆంక్షలను అమలు చేస్తూనే కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోం శాఖ నిర్దేశం చేసింది. ట్రాన్సిమిషన్ చెయిన్‌ను బ్రేక్ చేయాలని, తద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. జనవరి 27న విడుదల చేసిన మార్గదర్శకాలను మార్చి 31 వరకు అమలు చేయాలని సూచించింది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2ZVLOxv
No comments:
Post a Comment