Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 February 2021

పీఎస్ఎల్వీ-సీ51 కౌంట్‌డౌన్: ప్రయోగానికి ప్రత్యేకతలెన్నో.. నింగిలోకి భగవద్దీత!

ఈ ఏడాదిలో నిర్వహించే తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ () సిద్ధమయ్యింది. ఆదివారం (ఫిబ్రవరి 28న) పీఎస్ఎల్వీ ద్వారా తొలిసారిగా ప్రైవేట్ సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది. పీఎస్‌ఎల్‌వీ సీ-51 రాకెట్ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజానియా-1 సహా మరో 20 ఉప్రగహాలను నింగిలోకి పంపనున్నారు. ప్రైవేట్ సంస్థలు రూపొందించిన ఆనంద్‌, సతీశ్‌ ధావన్‌, యునిటీశాట్‌ ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఫిబ్రవరి 28 ఉదయం 10.23 గంటలకు ఈ ప్రయోగం నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన 25.30 గంటల కౌంట్‌డౌన్ శనివారం ఉదయం 8.54 గంటలకు ప్రారంభమయ్యింది. ఈ కౌంట్‌డౌన్‌ 25 గంటలపాటు నిరంతరాయంగా సాగిన అనంతరం వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. కాగా, ఈ ప్రయోగానికి మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఉపగ్రహాలపై మొత్తం 20 వేల మంది పేర్లను రాశారు. ఇందులో 900 మంది విదేశీయుల పేర్లు, చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లు ఉన్నాయి. అలాగే, అంతరిక్షంలోకి తొలిసారి భగవద్గీతను పంపుతున్నారు. గతంలో పలు దేశాలు అంతరిక్షంలోకి బైబిల్‌ను పంపాయి. ప్రయోగానికి ముందు తిరుమల శ్రీవారి ముందు రాకెట్ నమూనాను ఉంచి పూజలు చేయడం ఆనవాయితీ. ఈసారి కూడా ఆ సంప్రదాయాన్ని ఇస్రో కొనసాగించింది. ఇస్రో ఛైర్మన్ కే శివన్ శ్రీవారిని శనివారం ఉదయం దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నట్టు తెలిపారు. నింగిలోకి పంపనున్న‘ఆనంద్‌’ను బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ పిక్సెల్‌ రూపొందించగా, ‘సతీశ్‌ ధావన్‌’ను చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్‌ (శ్రీపెరంబుదూర్‌), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌(నాగ్‌పుర్‌), శ్రీశక్తి శాట్‌ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు. బ్రెజిల్‌ రూపొందించిన అమోజానియా-1 తొలి భూ పర్యవేక్షణ ఉపగ్రహం..అంతరిక్ష రంగంలో సంస్కరణల తర్వాత ఈ ప్రయోగం ఇస్రో సహా దేశం మొత్తానికి ఎంతో ప్రత్యేకం. ‘పీఎస్‌ఎల్వీ-సీ51 (మిషన్) దేశంలో ఇదే మొదటిది కాగా, భారత అంతరిక్ష సంస్కరణల కొత్త శకానికి నాంది పలకబోతోంది. పీఎస్ఎల్వీ-సీ51 లేదా అమెజానియా-1 అనేది న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) తొలి వాణిజ్య మిషన్. ఎన్ఎస్ఐఎల్ మిషన్‌ను అమెరికాకు చెందిన స్పేస్‌ఫ్లైట్ సహాకారంతో ఏర్పాట్లు చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3aYJkF1

No comments:

Post a Comment