Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 February 2021

ఎన్నికల నగారా మోగింది.. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే

దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం (ఫిబ్రవరి 26) షెడ్యూల్ విడుదల చేసింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి విడతల వారీగా ఎన్నికలు జరగనున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఆయా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల్ కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. కీలక రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లో 294 స్థానాలకు, తమిళనాడులో 234 స్థానాలకు, కేరళలో 140 స్థానాలకు, అసోంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మే 2న చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రాల వారీగా ఎన్నికల షెడ్యూల్ ఇలా.. ✦ కేరళ ఎన్నికల షెడ్యూల్ (ఒకే విడత) ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 12 నామినేషన్ల పరిశీలిన: మార్చి 20 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 22 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 6 ✦ తమిళనాడు ఎన్నికల షెడ్యూల్ (ఒకే విడత) ఎన్నికల తేదీ: ఏప్రిల్ 6 ✦ పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ (ఒకే విడత) ఎన్నికల తేదీ: ఏప్రిల్ 6 ✦ అసోం ఎన్నికల షెడ్యూల్ (మూడు విడతలు) తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 2 నామినేషన్ల పరిశీలన: మార్చి 10 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 12 ఎన్నికల తేదీ: మార్చి 27 రెండో విడతఎన్నికల నోటిఫికేషన్: మార్చి 5 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 1 మూడో విడత: ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 12 పోలింగ్ తేదీ: ఏప్రిల్ 6 ✦ పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ (8 విడతలు) మొదటి విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 2 నామినేషన్ల పరిశీలిన: మార్చి 10 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 12 ఎన్నికల తేదీ: మార్చి 27 రెండో విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 5 నామినేషన్ల పరిశీలిన: మార్చి 15 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 17 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 1 మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 12 నామినేషన్ల పరిశీలిన: మార్చి 20 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 22 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 6 నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 16 నామినేషన్ల పరిశీలిన: మార్చి 24 నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 26 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 10 ఐదో విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 22 నామినేషన్ల పరిశీలిన: మార్చి 31 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 3 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 17 ఆరో విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 26 నామినేషన్ల పరిశీలిన: ఏప్రిల్ 5 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 7 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 22 ఏడో విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 31 నామినేషన్ల పరిశీలిన: ఏప్రిల్ 8 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 12 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 26 8వ విడత ఎన్నికల నోటిఫికేషన్: మార్చి 31 నామినేషన్ల పరిశీలిన: ఏప్రిల్ 8 నామినేషన్ల ఉపసంహరణ: ఏప్రిల్ 12 ఎన్నికల తేదీ: ఏప్రిల్ 29 ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలు వెల్లడించే తేదీ: మే 2 (అన్ని రాష్ట్రాల్లో) ముఖ్యాంశాలు:
  • కరోనా జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహిస్తున్నామని సీఈవో సునీల్ అరోరా తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
  • కరోనా రోగులకు ఓటింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
  • ఈసారి పోలింగ్ సమయాన్ని గంట సేపు పెంచుతున్నట్లు ఈసీ తెలిపింది.
  • ఫిర్యాదుల కోసం సి-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవకతవకలు జరిగినట్లు గుర్తించినా యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు.
  • మొత్తం 824 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
  • 5 రాష్ట్రాల్లో కలిపి 18.68 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
  • 5 రాష్ట్రాల్లో కలిపి 2.7 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • బెంగాల్‌లో లక్షకు పైగా కేంద్రాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
  • తమిళనాడులో 89 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
  • ఆయా రాష్ట్రాలకు, సున్నితమైన ప్రాంతాలకు ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
  • వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఈసీ తెలిపింది.
Also Read: ★ ★ ★


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dNIywc

No comments:

Post a Comment