Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 27 March 2017

బండ్ల గణేష్ ఒక తోడేలు


బండ్ల గణేష్ ఒక తోడేలు 


 చిన్న నటుడి స్థాయి నుండి స్టార్ హీరోలతో సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు బండ్ల గణేష్. అయితే అప్పట్లో మనోడిపై హీరో సచిన్ జోషి ఏకంగా కోర్టు కేసు బనాయించాడు. 'టెంపర్' సినిమా కోసం అప్పు తీసుకున్నాడని.. అది తీర్చట్లేదని.. అందుకే కోర్టు నోటీస్ ఇచ్చినట్లు అప్పట్లో సచిన్ జోషి వర్గాలు తెలిపాయి. ఇదే విషయంపై రీసెంటుగా ఒక యుట్యూబ్ ఛానల్ ఇంటర్యూలో బండ్ల గణేష్ ను ప్రశ్నిస్తే.. అసలు సచిన్ జోషి ఎవరు? అంటూ తిరిగి ప్రశ్నించాడు. బండ్ల గణేష్ ను టచ్ చేసే స్థాయి ఎవ్వరికీ లేదని కూడా చెప్పేశాడు.

ఇప్పుడు ఇదే విషయంపై 'వీడెవడు' సినిమా ట్రైలర్ లాంచ్ టైమ్ లో మీడియా అడగటంతో.. సచిన్ జోషి కూడా ఘాటుగానే స్పందించాడు. ''నా దృష్టిలో బండ్ల గణేష్ అనేవాడు నథింగ్. నేను తెలుసా లేదా అనే విషయం అతనికే తెలియాలి. అతను ఒక కుక్క. కుక్క కూడా కాదు.. అవి చాలా విశ్వాసంగా ఉంటాయి. వాటి పేరు పాడు చేయడం నాకు ఇష్టం లేదు. మనోడు ఒక తోడేలు'' అంటూ సచిన్ జోషి చెప్పాడు. అంతేకాదు.. బండ్ల గణేష్ ఈయన దగ్గర తీసుకున్న అప్పులు వివరాలను చెబుతూ.. వాటికి సంబంధించిన బాండ్ పేపర్లను కూడా చూపించింది సచిన్ టీమ్. ''మాకు 27.9 కోట్లు ఇవ్వాలి. 12.5 కోట్లకు ఆయన పత్రాలు కూడా సైన్ చేశాడు. సచిన్ జోషి తెలియదని ఎలా అంటాడు?'' అంటూ సచిన్ టీమ్ కు చెందిన వ్యక్తి ప్రశ్నించారు.

ఇకపోతే మీడియా అనేవారు పోస్ట్ మ్యాన్ లా పనిచేయకూడదని.. వ్యవహారాత్మకంగా ఉండాలని మీడియాకు చురకలు వేశాడు సచిన్ జోషి. రెండువైపల నుండి అన్నీ కనుక్కుని నిజాన్ని రాయాలని.. ఎవరో ఏదో కామెంట్ చేస్తే.. దానిని హెడ్డింగ్ లో పెట్టేసి వేస్తే అది జర్నలిజం కాదంటూ కాస్త ఘాటుగా చెప్పాడు ఈ 'ఉరేయ్ పండు' హీరో.

''మట్టిలోకి వెళ్ళి బురద అంటుకోకూడదు అనుకుంటే ఎలా. నాకు బండ్ల గణేష్ అలా. వాడు ఒక రాహు కేతువు లాంటోడు. వాడిపై 14 కేసులు పెట్టాను. కోర్టు వాడి సంగతి చూసుకుంటుంది. బండ్ల గణేష్ ముఖం మీద అంతా మంచే చెబుతాడు.. కాని మనం వెళ్ళాక మన గురించి చెత్త చెబుతాడు. ఇలా అందరి నటుల గురించీ చెప్పాడు'' అంటూ ఘాటుగా గణేష్ గురించి కామెంట్ చేశాడు సచిన్ జోషి.

బండ్ల గణేష్ పదేపదే వెనుకపడటంతో.. చరణ్ మరియు ఎన్టీఆర్ తో సినిమాలు చేస్తున్నా అని చెప్పడంతో.. తన కంపెనీ (వైకింగ్ ఎంటర్టయిన్మెంట్) గణేష్ కు అప్పు ఇచ్చిందని చెప్పాడు. ''అసలు మనోడు ఏదీ నిజం చెప్పడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేస్తున్నా అంటున్నాడు. పవన్ అంటే ఒక శక్తి. ఇండియాలోనే గొప్ప నటుడు. అతని పేరు కూడా వీడు నాశనం చేస్తున్నాడు. అసలు ఒకసారి మనోడితో జూ.ఎన్టీఆర్ ఇంటికి వెళితే.. వాడ్ని ఎందుకు తీసుకొచ్చావ్.. వాడ్ని లోపలకు తేవొద్దు.. అన్నాడు ఎన్టీఆర్. వీడికి ఉన్న గౌరవం అది'' అని చెప్పాడు సచిన్. పైగా గణేష్ రాసిన ప్రామిసరీ నోట్లన్నీ కూడా మీడియాకు చూపిస్తూ.. వీటి కాపీస్ ఇవ్వలేం.. ఎందుకంటే కోర్టులో ఉంది కేసు అంటూ సచిన్ టీమ్ తెలియజేశారు.

ఇకపోతే ఒకసారి గణేష్ విషయంలో సెటిల్మంట్ జరిగిందని.. ఆ సమయంలోనే మనోడు అరెస్టయ్యేవాడని.. కాని వాళ్ళ నాన్న గారు కన్నీరు పెట్టుకోవడం వలన సేవ్ అయ్యాడని చెప్పాడు సచిన్. ''అసలు గణేష్ లాంటి కొడుకు కోసం ఆయన తండ్రి కన్నీరు పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయం. అప్పుడే అరెస్టయ్యేవాడు. అందుకే అప్పుడు 14 కోర్టు కేసులు పెట్టాం. ఇప్పుడు మనోడి సంగతి కోర్టు చూసుకుంటుంది'' అంటూ చెప్పాడు సచిన్ జోషి. దీనిపై మరోసారి గణేష్ ఏమన్నా స్పందిస్తాడేమో చూడాలి.

No comments:

Post a Comment