Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 28 July 2019

నిండుకుండల్లా ఆల్మట్టి, నారాయణ్‌పూర్.. తెలుగు రాష్ట్రాలవైపు కృష్ణమ్మ పరుగులు

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద కొనసాగుతోంది. పైన కురుస్తోన్న వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఆలమట్టి ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ప్రస్తుతం జలాశయానికి ఎగువ నుంచి 88 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా.. 98 వేలు క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ఆరు వరద గేట్ల ద్వారా 58 వేల క్యూసెక్కులు, విద్యుత్తు ఉత్పత్తి ద్వారా 40 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఆలమట్టికి ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహం అధికంగా ఉండడంతో మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులోని బెళగావి జిల్లా చిక్కోడి తాలూకాలో మూడు వంతెనలు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలోకి ఎవరూ దిగవద్దంటూ పరిసర ప్రాంతాల ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. మరోవైపు, నారాయణపూర్‌ జలాశయంలోనూ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరింది. ప్రాజెక్టులోకి 1.02 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో ఆదివారం అర్ధరాత్రి దిగువకు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నారాయణపూర్ జలాశయం నుంచి నీటిని కిందకి విడుదల చేయడంతో అవి జూరాలకు నేడు రానున్నాయి. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1.98 క్యూసెక్కుల నీరు నిల్వ ఉంది. ఇది 2.88 టీఎంసీలకు చేరుకుంటే ఎత్తిపోతల పథకాలకు నీటి సరఫరా ప్రారంభమవుతుంది. తొలుత నెట్టెంపాడు వద్ద లిఫ్టులతో ర్యాలంపాడు, గుడెందొడ్డి జలాశయాలకు నీటిని ఎత్తిపోస్తారు. అలాగే కోయిల్‌సాగర్ లిఫ్టుతో ఫర్దీపూర్, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు, భీమా-1తో భూత్పూరు, సంగంబండ, భీమా-2తో ఏనుకుంట, శ్రీరంగాపూర్ జలాశయాలకు నీటిని తరలిస్తారు. మరోవైపు, జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదలకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల ప్రవాహం కొనసాగితే మంగళవారం నుంచి కాల్వలకు నీటిని విడుదల చేయనున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్పిని కూడా ప్రారంభిస్తారు. ప్రవాహం మరింత పెరిగితే ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తి బయటకు నీటిని విడుదల చేస్తారు. ఇక్కడ నుంచి శ్రీశైలానికి నాలుగు రోజుల్లో వరద చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా పరివాహక ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Zlbphm

No comments:

Post a Comment