Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 29 July 2019

అన్న క్యాంటీన్ల మూసివేత.. జగన్ సర్కార్ క్లారిటీ

అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం మూసివేస్తోందా. జిల్లాలవారీగా క్యాంటీన్లు ఎందుకు మూతపడినట్లు. కొద్దిరోజులుగా ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్యాంటీన్ల మూసివేతపై జగన్ సర్కార్ అసెంబ్లీలో స్పష్టత ఇచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి ఈ అంశంపై స్పందించారు. క్యాంటీన్లను మూసివేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు. పేదవాడి కడుపుకొట్టే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు బొత్స. అన్న క్యాంటీన్‌లను మూసివేసేది లేదని.. పేదవాడి ఆకలి తీర్చే వాటికి కూడా గతంలో పార్టీ రంగు వేశారని విమర్శించారు. చివరికి మార్చురీ పక్కన కూడా క్యాంటీన్ పెట్టారని విమర్శించారు. క్యాంటీన్ రంగు మార్చినంత మాత్రాన పథకం రద్దు చేసినట్లు కాదన్నారు. ఎన్నికలకు ముందు హడావుడిగా వీటిని ఏర్పాటు చేశారని.. వీటిని ప్రక్షాళన చేసి ప్రజలకు మేలుచేసే ఆలోచనలో ఉన్నామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లు మాత్రమే ఉన్నాయన్నారు. అంతకుముందు అన్న క్యాంటీన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరిగిందని అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. అన్న క్యాంటీన్లను టీడీపీ నేతలు ప్రచారానికి వాడుకున్నారని.. వాటిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో అన్నపూర్ణ పథకం ప్రవేశ పెట్టారని.. అక్కడ ఈ పథకం కోసం కేవలం రూ.లక్షన్నర మాత్రమే ఖర్చు పెడితే.. ఇక్కడ మాత్రం అన్న క్యాంటీన్ల కోసం టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్క క్యాంటీన్‌కు రూ.40-50 లక్షలు ఖర్చు చేసిందని ఆరోపించారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Ki8csO

No comments:

Post a Comment