Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 30 July 2019

YS Jagan 'స్పందన'.. గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. పేరుతో ప్రతి సోమవారం ప్రజల సమస్యలన్ని పరిష్కరించేందుకు ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వాలు, సీఎంలు గ్రీవెన్స్ సెల్‌లు నిర్వహించినా.. కానీ జగన్ మాత్రం అలాకాదు.. ప్రతివారం స్పందనపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఎక్కడ చిన్న తప్పు జరిగినా అధికారుల్ని హెచ్చరిస్తూ.. అధికారుల తప్పుంటే వెంటనే చర్యలు తీసుకుంటూ గత ముఖ్యమంత్రుల కంటే భిన్నంగా ముందుకు సాగుతున్నారు. సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంపై జగన్ ఈ వారం కూడా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్పందన కింద వస్తున్న దరఖాస్తుల సంఖ్య పెరుగుతోందన్నారు సీఎం. సమస్యల పరిష్కారంపై అంకిత భావం చూపుతున్నారని.. అందుకే ప్రజలు పెద్దసంఖ్యలో వస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇచ్చిన అర్జీ చెత్త బుట్టలోకి పోవడం లేదని.. కలెక్టర్లు సమస్యల్ని సీరియస్‌గా తీసుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ఇప్పుడే మన మీద బాధ్యత పెరుగుతుందని.. సమస్యల పరిష్కారంలో నాణ్యత అనేది చాలా ముఖ్యమని.. కలెక్టర్లు ధ్యాస పెడితే తప్ప.. ఇది సాధ్యంకాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమం జరుగుతందా లేదా.. ప్రతి ఎమ్మార్వో, ఎంపీడీవో స్పందనను సీరియస్‌గా తీసుకుంటున్నారని అనుకుంటున్నానన్నారు. ఎక్కడైనా జరగకపోతే.. వెంటనే జరిపేలా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్లు, ఎస్సీలు సమర్థులు అని గట్టిగా నమ్ముతున్నానని.. ప్రజా సమస్యల విషయంలో ఎక్కడా వెనకడుగు వేయొద్దన్నారు. మండలాల్లో ఎక్కడా అవినీతి కూడా లేకుండా చూడాలని.. ప్రజలు సంతృప్తికరంగా ఉండాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అవినీతి చేస్తే సహించబోమని ప్రతి సమీక్షా సమావేశంలో చెప్పాలని.. అవినీతి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామనే సంకేతాలు పంపించాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెడ్డపేరు తెచ్చుకోవద్దన్నారు. ప్రతి సమీక్షా సమావేశంలో ఈవిషయాన్ని గుర్తు చేస్తున్నానన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లభ్యతమై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సెప్టెంబరు నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుందని.. అన్ని ర్యాంపుల్లో వీడియో కెమెరాలు ఉంటాయి, పారదర్శకంగా విధానం ఉంటుందన్నారు. ఇసుక కొరత లేకుండా చూడాలని.. అవసరమైతే ర్యాంపులు తెరవాలన్నారు. అలాగే అవినీతి లేకుండా చూసుకోవాలని.. ఇసుక లభ్యత లేకపోతే రేటు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం నాణ్యతపై దృష్టిపెట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పాత ప్రభుత్వం పెట్టిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశించానని.. మధ్యాహ్న భోజనం పథకానికి ఇవ్వాల్సిన సమయంలో డబ్బులు ఇవ్వాలన్నారు. లేకపోతే భోజనం నాణ్యత పడిపోతుందన్నారు. మధ్యాహ్న భోజన కలెక్టర్లకే ఈ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. ఇక గ్రామ, వార్డు సచివాలయాలకు భవనాల గుర్తింపు తప్పనిసరని.. అన్ని వసతులు ఉన్నాయా? లేదా? చూసుకోవాలన్నారు. కంప్యూటర్, ఇంటర్నెట్ కనెక్షన్, స్కానర్, ప్రింటర్ ఉండాలన్నారు. దరఖాస్తు చేసుకున్న 72 గంటల్లో రేషన్ కార్డు, పెన్షన్ కార్డు ఇచ్చేట్టు ఉండాలన్నారు. ప్రజలు సంతృప్తికరంగా ఉండాలి.. సంతృప్త స్థాయిలో పథకాలు అమలు జరగాలన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగాల కోసం ప్రతి జిల్లాలో కూడా కనీసం లక్షమంది పరీక్షలు రాస్తున్నారన్నారు జగన్. ఇంతమంది పరీక్ష రాయడం ఎప్పుడూ జరగలేదని.. ధ్యాస పెడితేనే.. ఇది సజావుగా జరుగుతుందన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు. ఇంత భారీ స్థాయిలో పరీక్షలు రాస్తున్నప్పుడు ఇబ్బందులు వస్తాయని.. వాటిని ముందుగానే గుర్తించి రాకుండా చూడాలని సూచించారు. మినర్ వాటర్ ప్లాంట్లు, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల మీద దృష్టి పెట్టాలన్నారు. జిల్లాలో ఉన్న ప్లాంట్లు కచ్చితంగా పనిచేసేలా చూడాలన్నారు. కరువు పీడిత ప్రాంతాల్లో నవధాన్యాల సాగుకు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.. రైతులకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LNFPpq

No comments:

Post a Comment