Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 13 August 2019

అంగట్లో ఆడబిడ్డ.. రూ.1000కి బేరం పెట్టిన తల్లి

జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది. 7నెలల ఆడబిడ్డను రూ.1000కి అమ్మాకానికి పెట్టింది ఓ తల్లి. జనగామ జిల్లా పెంబర్తికి చెందిన దంపతులు జ్వరంతో బాధపడుతున్న 7నెలల ఆడబిడ్డను మంగళవారం వరంగల్ ఎంజీఎంకు తీసుకొచ్చారు. అక్కడికొచ్చాక దంపతులిద్దరికీ గొడవ జరిగింది. దీంతో భర్త ఆమెను వదిలి వెళ్లిపోయాడు. భర్తపై చిర్రెత్తుకొచ్చిన మహిళ తన ఆడబిడ్డను వరంగల్ బస్టాండ్‌కు తీసుకెళ్లి అమ్మకానికి పెట్టింది. రూ.వెయ్యి తన బిడ్డను ఇచ్చేస్తానని కొందరికి చెప్పింది. మహిళ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మహిళను ప్రశ్నించారు. చిన్నారిని శిశు సంక్షేమ శాఖాధికారులకు అప్పగించారు. భర్తపై కోపంతో నవమాసాలు మోసి కన్న బిడ్డను అమ్మకానికి పెట్టిన మహిళపై స్థానికులు మండిపడ్డారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YY0mtr

No comments:

Post a Comment