Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 13 August 2019

ఆవుల మరణాలు.. మీడియాపై దుష్ప్రచారం.. ఓ జర్నలిస్ట్ ఆవేదన

సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో ఇటీవలే భారీ సంఖ్యలో ఆవులు మరణించిన సంగతి తెలిసింది. మూగజీవాలు భారీ సంఖ్యలో ప్రాణాలు వదలడం తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరి మనసును కలచి వేసింది. ఈ ఘటనపై మీడియాలో భారీగా కథనాలు వచ్చాయి. టీవీ, ప్రింట్, వెబ్ మీడియాలు వరుస కథనాలను వెలువరించాయి. ఘటన జరిగిన రోజే మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గోశాలకు వెళ్లారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. కుట్ర కోణం దాగి ఉందేమో అనే అనుమానం వ్యక్తం చేశారు. మీడియా కవరేజీ, ప్రతిపక్షం అనుమానాలే కాకుండా ప్రభుత్వం కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. ఆరుగురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆవుల మరణాలను మీడియా పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ‘‘101 ఆవులు చనిపోతే చీమ కుట్టినట్టు కూడా లేదు, మీడియాలో లేదు పేపర్లో రాలే’’దంటూ.. తెగ బాధపడిపోతూ.. గడ్డి తిని బతుకుతున్నట్టున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నిజంగా దుష్ప్రచారమే. ఆవులు చనిపోయిన రోజున మీడియా ఈ అంశాన్ని ఎంతగా హైలెట్ చేసిందో అందరికీ తెలిసిందే. మరో రకంగా చెప్పాలంటే.. మీడియా వరుస కథనాలను చూశాకే, పరిస్థితి తీవ్రత తెలిశాకే నేతలు స్పందించారు. మీడియాలో నాలుగు రోజులుగా వరుస కథనాలు ప్రసారం చేస్తున్నప్పటికీ.. మీడియా పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పోస్టుపై ఓ జర్నలిస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. పోస్టు పెట్టిన వ్యక్తిని కడిగిపారేశారు. ఇంట్లో కూర్చొని పోస్టు క్రియేట్ చేసి బాగానే వైరల్ చేశారు కానీ.. పేపర్ చదివినా, టీవీ చూసినా, ఫోన్లోనే వెబ్‌సైట్లను చూసినా మీడియా కవరేజీ ఎంతగా ఉందో తెలిసేది కదా అంటూ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి చురకలు అంటించారు. నాలుగు రోజులుగా మీడియా హైలెట్ చేస్తోందని, సంఘటన జరిగిన రోజున గోశాల నుంచి ప్రత్యక్ష ప్రసారం చేశామని గుర్తు చేశారు. ‘‘ఓ దశలో ఆవుల మరణాలకు మీరే కారణమంటూ గోశాల నిర్వాహకులతో మీడియా ప్రతినిధులు వాగ్వాదానికి దిగారు. ఈ వార్తలు కవర్ చేస్తున్నప్పుడు దూడలు చనిపోయిన తల్లి దగ్గర పాలు తాగుతున్న దృశ్యాలు చూసి కళ్ల వెంట నీళ్లు పెట్టుకున్న జర్నలిస్టులు ఉన్నారు. ప్రతి ఒక్క జర్నలిస్టు తమ ఇంట్లో మనిషి చనిపోతే ఎంతగా అల్లాడిపోతారో అంతకన్నా ఎక్కువగా బాధపడ్డారు. కొన్ని ఛానెల్స్‌ దీనిపై డిబేట్లు కూడా పెట్టాయి. ఆఖరికి ఆవులకు పోస్టు మార్టం చేసే దగ్గర కూడా ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని నిల్చున్నాం. చనిపోయిన ఆవుల మధ్య సాయంత్రం వరకూ కనీసం తిండీ తిప్పలు కూడా మానేసి న్యూస్ కవర్ చేశాం’’ అని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు సామాజిక బాధ్యత ఉంటుంది. పత్రికల్లో, ఛానెళ్లలో పని చేసే జర్నలిస్టులు కూడా సాధారణ మనుషులే. మాకు ఫీలింగ్స్ ఉంటాయి. మాకు గోవులంటే అభిమానం ప్రేమ ఉంటాయి.. మాకూ మనసు ఉంటుందంటూ అశోక్ ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఈ పోస్టు పెట్టినవారు, దాన్ని సర్క్యులేట్ చేస్తున్న వారు ఒక్కరైనా గోశాలను సందర్శించారా.. కనీసం గుప్పెడు గడ్డి నోరులేని ఆ మూగజీవాలకు వేశారా..? అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు వస్తారు? ఎందుకు వేస్తారు? అదంతా ఖర్చుతో కూడుకున్న పని కదా. అదే సోషల్ మీడియాలో పోస్టు అయితే పైసా ఖర్చుండదు. పైగా కావాల్సినంత పైశాచికానందం. నా ఉద్దేశంలో కచ్చితంగా పార్శిల్‌లో విజయవాడ నుంచి గడ్డి తెప్పించుకుని తింటూ ఇలాంటి పోస్టు పెట్టి ఉంటారనుకుంటున్నాన’’ని ఆయన చురకలు అంటించారు. గోవుల మరణాలపై ‘సమయం’ కథనాలు.. వీడియో:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yWQ9D6

No comments:

Post a Comment