జమ్మూ కశ్మీర్లో హింస తలెత్తుతోందని వార్తలొస్తున్నాయని కాంగ్రెస్ నేత ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాహుల్ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర గవర్నర్ సత్య పాల్ మాలిక్ కౌంటర్ ఇచ్చారు. ‘‘కశ్మీర్లో లోయను సందర్శించడానికి ఎయిర్‌క్రాఫ్ట్ పంపుతా వచ్చి.. ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసుకోండి’’ అని కాంగ్రెస్ నేతను ఉద్దేశించి గవర్నర్ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తోన్న తీరుతో రాహుల్ సిగ్గుపడాలన్నారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఇలా మాట్లాడొద్దు. విమానం పంపిస్తా, ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షించమని రాహుల్‌కు గవర్నర్ సూచించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదని కేంద్రం చెబుతోంది. ఒక్క బుల్లెట్ కూడా కాల్చలేదని స్పష్టం చేసింది. కానీ రాహుల్ మాత్రం.. కశ్మీర్ లోయలో హింస జరుగుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయన్నారు. ఈ ఆందోళనలు తగ్గించడానికి ప్రధాని మోదీ ప్రయత్నించాలని, పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సలహా ఇచ్చారు. విమానం పంపిస్తా వచ్చేయమని జమ్మూ కశ్మీర్ గవర్నర్ తనకు పంపిన ‘ఆహ్వానం’ పట్ల రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘మీ ఆహ్వానం మేరకు నేను, ప్రతిపక్ష నేతల బృందం జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తాం. మాకు ఎయిర్‌క్రాఫ్ట్ వద్దు. కానీ స్వేచ్ఛగా పర్యటించేలా, ప్రజలను, అక్కడ నేతలు, సైనికులను కలిసే అవకాశం కల్పించడ’’ని కోరారు. కాంగ్రెస్ నేత స్పందన పట్ల జమ్మూ కశ్మీర్ గవర్నర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KL8vfA
No comments:
Post a Comment