Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 27 August 2019

మోదీ మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం: పాక్ ఉత్తర ప్రగల్భాలు!

కశ్మీర్ అంశంలో అగ్రరాజ్యం అమెరికా చేతులెత్తేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచించడంతో పాక్ ప్రధాని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో విపక్షాలు ఆయనను దోషిగా చూపిస్తున్నాయి. దీంతో తాను ముందుండి కశ్మీర్ అంశాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్తానంటూ మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఇమ్రాన్ స్వచ్ఛందంగా ప్రకటించారు. ఇందులో భాగంగా భారత్‌ విమానాలు తమ గగనతలం నుంచి ప్రయాణించకుండా నిషేధం విధించారు. పాక్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఫవాద్ ఛౌదురి దీనిపై మాట్లాడుతూ.. భారత వాణిజ్యానికి సహకరించే మార్గాలను నిలిపివేయలనే ఆలోచనతో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉన్నారని అన్నారు. ‘తమ గగనతలం మీదుగా భారత్ విమానాలు పయనించకుండా మూసివేయాలని ప్రధాని భావిస్తున్నారు.. అలాగే ఆఫ్గన్‌తో తమ గగనతలం మీదుగా జరిగే భారత్ వాణిజ్య కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని క్యాబినెట్ భేటీలోనూ సూచనలు చేశారన్నారు. న్యాయపరమైన విధివిధానాలు పూర్తయిన తర్వాత నిర్ణయాన్ని అమలు చేస్తామని, మోదీ ప్రారంభిస్తే, తాము ముగిస్తామంటూ’ ఫవాద్ ట్వీట్ చేశారు. కశ్మీర్ అంశంపై ప్రత్యేకంగా సమావేశమైన పాక్ మంత్రివర్గం.. జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులపై చర్చించింది. జమ్మూ కశ్మీర్‌లో భారత్ తీసుకున్న చర్యలకు భవిష్యత్ కార్యాచరణ గురించి వారు చర్చించారు. వీటితోపాటు భారత్‌వైపు వెళ్లే గగనతలం, భూ మార్గాలను మూసివేయాలని నిర్ణయించారు. ఇమ్రాన్‌ సహా క్యాబినెట్ సహచరులు కశ్మీరీలకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నట్టు తెలిపారు. కాగా, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, యూఏఈ, బహ్రెయిన్ పర్యటనకు ఆగస్టు 22న పాక్ గగనతలాన్ని వినియోగించుకున్నారు. దీనిపై పాకిస్థానీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మోదీ విమానం పర్యటనకు ఎందుకు అనుమతించారని నిలదీస్తున్నారు. విమర్శలు రావడంతో ఇమ్రాన్ ఖాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్, ఆఫ్గన్ వాణిజ్యం కోసం వినియోగించే తమ దేశం గుండా వెళ్లే అన్ని భూ మార్గాలను మూసివేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. వాయు, భూ మార్గాలను మూసివేయడం వల్ల రవాణ ఖర్చులు పెరిగి, ఆఫ్గన్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే భారత్‌తో వాణిజ్యం, దౌత్య సంబంధాలను పాకిస్థాన్ రద్దుచేసుకుంది. ఢిల్లీలోని తమ హైకమిషనర్‌ను వెనక్కు పిలిపించిన పాక్, అక్కడ భారత రాయబారిని పంపేసింది. పాక్‌ను 1996లో అత్యంత అనుకూల దేశం హోదాలో చేర్చిన భారత్, పుల్వామా ఉగ్రదాడితో ఐదు నెలల కిందట ఆ హోదా నుంచి దాన్ని తప్పించింది. దీంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుని, గగనతలంపై కూడా నిషేధం విధించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32cDvwr

No comments:

Post a Comment