Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 6 August 2019

షూటింగ్‌ నుంచి భర్త లేట్‌గా వస్తున్నాడని నటుడి భార్య ఆత్మహత్య

టీవీ నటుడైన భర్త షూటింగుల నుంచి ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడన్న ఆవేదనలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మణికొండలో మంగళవారం చోటుచేసుకుంది. టీవీ సీరియల్స్‌లో నటిస్తున్న మధుప్రకాష్‌కు గుంటూరుకు చెందిన భారతి(34)తో 2014లో వివాహమైంది. భారతి మణికొండలోని పంచవటి కాలనీలో భర్తతో పాటు అత్తమామలు, మరదితో కలిసి ఆమె నివసిస్తూ.. ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. షూటింగ్ కోసం రోజూ ఉదయం బయటకు వెళ్లే అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుంటారు. దీంతో భర్త తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసేశారు. దీనిపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. సోమవారం(ఆగస్టు 5) రాత్రి ఆలస్యంగా వచ్చిన భర్తపై భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరూ వేర్వేరు గదులో పడుకున్నారు. మంగళవారం ఉదయం నిద్ర లేచిన మధుప్రకాష్ జిమ్‌కు వెళ్లి అక్కడి నుంచే షూటింగ్‌కు వెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన భారతి భర్తకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆందోళన చెందిన మధు సాయంత్రం 7గంటల సమయంలో ఇంటికి రాగా బెడ్‌రూమ్ తలుపు వేసి ఉంది. ఎంతగా పిలిచిన ఆమె స్పందించకపోవడంతో మారుతాళంతో తలుపు తెరవగా భారతి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో మధుప్రకాష్ రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి భర్తతో పాటు ఆమె అత్తమామలను ప్రశ్నించారు. భారతి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2GRsok5

No comments:

Post a Comment