Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 6 August 2019

ఐబీ క్రికెట్‌కు ‘స్టార్టప్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు

గేమింగ్ ప్రపంచంలో ఒక నవ శకం సృష్టించిన వర్చువల్ రియాలిటీ గేమ్ మరో మైలురాయిని అందుకుంది. వీఆర్ టెక్నాలజీ ద్వారా అత్యంత ఇష్టమైన క్రికెట్‌ను ప్రపంచస్థాయి స్టేడియాల్లో ఆడే అనుభూతిని కలిగించే ఐబీ క్రికెట్ ఈ ఏడాది ‘స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ 2019’ అవార్డుకి ఎంపికైంది. ప్రొయుగ కంపెనీ రూపొందించిన ఐబీ క్రికెట్‌కు ఎంట్రప్రెన్యూర్ ఇండియా మ్యాగజీన్ ఈ అవార్డును అందజేసింది. క్రికెట్‌పై అవగాహన ఉన్న ప్రతి ఒక్కిరికీ పరిచయం అక్కర్లేని గేమ్ ఈ ఐబీ క్రికెట్. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఐబీ క్రికెట్‌తో ఒక గదిలో ఉంటూ అంతర్జాతీయ స్టేడియాల్లో క్రికెట్ ఆడొచ్చు. ఫోర్లు, సిక్సర్లు బాదేయొచ్చు. బౌలర్లకు చుక్కలు చూపించొచ్చు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు పొందే ఫీలింగ్‌ను ఐబీ క్రికెట్ ద్వారా పొందొచ్చు. Read also: వీఆర్ హెడ్‌సెట్‌ను ధరించి, ఎలక్ట్రానిక్ మోషన్ సెన్సార్డ్ బ్యాట్‌ను చేత పట్టుకొని ఈ సరికొత్త క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టొచ్చు. వీఆర్ హెడ్‌సెట్ పెట్టుకోగానే మీరు మైదానంలో బ్యాట్స్‌మన్ స్థానంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ మైదానంలో బౌలర్ విసిరే బంతిని మీ చేతుల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మోషన్ సెన్సార్డ్ బ్యాట్‌తో బలంగా కొట్టడమే తరువాయి ఆ బంతి గ్యాలరీలో ఉన్న ప్రేక్షకుల మధ్య పడుతుంది. వాస్తవానికి మీరు ఆ బంతిని కొట్టనే కొట్టరు. కాకపోతే మీ చేతుల్లో ఉన్న ఎలక్ట్రానిక్ మోషన్ సెన్సార్డ్ బ్యాట్‌ను బలంగా ఊపడం వల్ల ఆ అనుభూతి కలుగుతుంది. ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థి వసంత్‌ సాయి, ఐఐటీ ఢిల్లీ మాజీ విద్యార్థి త్రివిక్రమ్ ప్రొయుగ కంపెనీ ద్వారా ఈ ఐబీ క్రికెట్‌‌ను అభివృద్ది చేశారు. గతేడాది ఫిబ్రవరి 22న లక్నోలో నిర్వహించిన ఐటీ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఐబీ క్రికెట్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. వీఆర్ హెడ్‌సెట్‌తో బ్యాట్ పట్టుకొని తొలి షాట్ ఆడారు. ఐబీ క్రికెట్‌ను విరాట్ కొహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్ తదితర క్రికెటర్లు కూడా ప్రశంసించారు. కోహ్లీ ఏకంగా బ్యాట్ పట్టి షాట్‌ కూడా ఆడారు. రానున్న కాలంలో దాదాపు 25 దేశాల్లో ఐబీ క్రికెట్‌ను లాంచ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YwZ8dp

No comments:

Post a Comment