భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు మరో గౌరవం దక్కింది. ఆయనకు పురస్కారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పురస్కారాన్ని వర్ధమాన్‌కు ప్రదానం చేయనున్నారు. అభినందన్‌కు వీర్ చక్ర ఇవ్వాలని కేంద్రానికి ఐఏఎఫ్ సిఫార్సు చేసింది. దీంతో పురస్కారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అభినందన్ ఫిబ్రవరి 27న గగనతలంలో పాక్ విమానాన్ని కూల్చారు. తర్వాత ఐఏఎఫ్ విమానం పాక్ భూ భాగంలో కూలిపోవడంతో.. స్థానికులు పట్టుకుని అక్కడి సైనికులకు అప్పగించారు. భారత దేశ రహస్యాల గురించి పాక్ సైన్యం అడిగినా బయటపెట్టకుండా.. తన ధైర్య సాహసాలు ప్రదర్శించారు. అభినందన్‌ను విడుదల చేయాలని భారత్ సహా ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయడంతో దాయాది దేశం తలొగ్గింది. పాక్ అభినందన్‌ను వాఘా సరిహద్దు దగ్గర తిరిగి అప్పగించింది. శత్రువు చేతికి చిక్కినా అభినందన్ చూపించిన తెగువకు యావత్ దేశం మొత్తం ఫిదా అయ్యింది. రియల్ హీరో అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు. ఆయన ధైర్య, సాహసాలకు మెచ్చి.. వీర్ చక్ర పురస్కారం ఇవ్వాలని భారత వాయుసేన (ఐఏఎఫ్) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా అభినందన్ పేరును కేంద్రానికి పంపారట. దీంతో కేంద్రం వీర్ చక్ర పురస్కారం ఇవ్వాలని నిర్ణయించింది. 1983 జూన్ 21న తమిళనాడులో జన్మించారు. ఆయన తండ్రి కూడా ఐఏఎఫ్‌లో ఎయిర్ మార్షల్, తల్లి డాక్టర్. వారి కుటుంబం చెన్నైలో నివాసం ఉంటోంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Z33E2C
No comments:
Post a Comment