Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 6 August 2019

వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రయివేట్ వాతావరణ సంస్థ స్కైమేట్ అంచనా వేస్తోంది. మరింత బలపడే అవకాశం ఉండటంతో.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లోని దక్షిణ ప్రాంతాలతోపాటు విదర్భలోనూ భారీ వర్షాలు కురుస్తాయని స్కైమేట్ అంచనా వేసింది. ఈ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం మెల్లగా తీరం వైపు కదులుతోంది. ఇది మూడు నాలుగు రోజుల్లో దేశం మొత్తం విస్తరించే అవకాశం ఉంది. అల్ప పీడన ప్రభావంతో.. బుధవారం ఉత్తరాంధ్రతోపాటు జార్ఖండ్, బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో వర్షాలు కురుస్తాయని స్కైమేట్ తెలిపింది. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉంటుందని.. మరో 48 గంటలపాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయు గుండంగా మారిందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఒడిశాకు ఆగ్నేయ దిశగా 160 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందన్నారు. మరో 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. రాయలసీమలో బుధ, గురువారల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31eKZyq

No comments:

Post a Comment