
విదేశాంగ శాఖ మాజీ మంత్రి, సీనియర్ నేత ఆరోగ్యం విషమించింది. మంగళవారం (ఆగస్టు 6) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. ఎయిమ్స్ వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. సుష్మా స్వరాజ్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సుష్మా స్వరాజ్.. ట్విటర్‌లో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ యాక్టివ్‌గా ఉన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొంత మంది నేతలు ఆమెకు సంతాపం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2GR3Asm
No comments:
Post a Comment