
బీజేపీ సీనియర్ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఇకలేరు. యావత్ భారతావనిని శోకసంద్రంలో ముంచుతూ గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. మంగళవారం (ఆగస్టు 6) రాత్రి ఢిల్లీలోని తన నివాసంలో ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఎయిమ్స్‌కు తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. గుండెపోటుకు గురైన కొద్ది క్షణాలకే ఆమె కన్నుమూసినట్లు తెలుస్తోంది. సుష్మా స్వరాజ్ మరణవార్తతో బీజేపీ శ్రేణులు షాక్‌కు గరయ్యాయి. దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. హోంమంత్రి అమిత్ షా, మంత్రలు నితిన్ గడ్కరీ, హర్షవర్ధన్.. ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. సుష్మా స్వరాజ్ కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ కారణంగా ఆమె ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే సుష్మా స్వరాజ్.. ట్విటర్‌లో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ యాక్టివ్‌గా ఉన్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33iaMaT
No comments:
Post a Comment