Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 3 October 2019

YSR Vahana Mitra Scheme: మాటిచ్చిన ఏలూరులోనే పథకాన్ని ప్రారంభించిన జగన్

పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న సీఎం .. పథకాన్ని ఏలూరులో ప్రారంభించారు. కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియం ఇందుకు వేదికైంది. ఈ పథకం ద్వారా సొంతంగా ఆటో, క్యాబ్‌ కలిగి వున్న ఆటోడ్రైవర్లకు ప్రభుత్వం ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయం చేయనుంది. ఈ మొత్తాన్ని ఆటోడ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేస్తారు. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని గతంలో ఏలూరులో ఉన్నప్పుడే హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు అదే నగరంలో వాహన మిత్ర పథకాన్ని ప్రారంభించడం విశేషం. ఈ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,75,531 మందికి లబ్ధి చేకూరుతుంది. విశాఖ, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వాహన మిత్ర పథకం కోసం అత్యధిక నామినేషన్లు వచ్చాయి. సామాజిక వర్గాల వారీగా చూస్తే ఈ పథకానికి అర్హులైన వారిలో బీసీలు 79 వేల మంది ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 13,062 మంది వాహనమిత్ర ద్వారా లబ్ధి పొందనున్నారు. అంతకు ముందు ఏలూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మెడికల్ కాలేజీని నిర్మించనున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2o3oPBr

No comments:

Post a Comment