కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తమిళనాడులో జరిగింది. తిరుప్పూరు జిల్లా ఊత్తుకుళి ప్రాంతానికి చెందిన నిషార్ అహ్మద్(37) అనే వ్యక్తి వ్యర్థాల గోదాములో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మొదటి భార్య వదిలి వెళ్లిపోవడంతో అదే ప్రాంతానికి చెందిన హసీనా(21) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. Also Read: ఇటీవల మద్యానికి బానిసైన అహ్మద్ తరుచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఆమెకు ఇతరులతో అక్రమ సంబంధాలు అంటగట్టి చిత్రహింసలు పెడుతున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం మరోసారి గొడవ జరగడంతో అహ్మద్ ఇంటి తలుపులు మూసేసి భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో హసీనా అక్కడికక్కడే చనిపోవడంతో ఆందోళన పడిన అహ్మద్ అదే కత్తితో తన గొంతు కోసుకున్నాడు. Also Read: కాసేపటి తర్వాత చిన్నారి ఏడుపు వినిపించడంతో పక్కింట్లోనే ఉండే హసీనా తల్లి వారింటికి వచ్చి చూడగా దంపతులిద్దరూ రక్తపు మడుగులో కనిపించారు. దీంతో ఆమె స్థానికుల సాయంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించింది. వారిని పరీక్షించిన డాక్టర్లు హసీనా చనిపోయిందని నిర్ధారించారు. కొన ప్రాణాలతో ఉన్న అహ్మద్‌కు చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అతడికి కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Kc7NZy
0 Comments