ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి ఆమె తల నరికి దాన్ని డబ్బాలో వేసుకుని 5కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లాడు. తలను ఓ ప్రాంతంలో వేలాడదీసేందుకు ప్రయత్నించగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: ఆగ్రాలోని కచ్చపురా ప్రాంతానికి చెందిన నరేష్ బఘేల్(33) అనే వ్యక్తికి శాంతి దేవి(29) అనే మహిళతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు సంతానం. టీవీ మెకానిక్‌గా పనిచేసే నరేశ్ చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశాడు. దీంతో భర్తలో మార్పు తెచ్చేందుకు శాంతి అనేకసార్లు ప్రయత్నించి విఫలమైంది. నరేశ్ రోజూ మద్యం తాగొచ్చి పిల్లల ముందే భార్యను చితకబాదేవాడు. ఆమెకు ఇతరులతో అక్రమ సంబంధాలు అంటగట్టి వేధించాడు. Also Read: ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చిన నరేశ్ భార్యపై చేయి చేసుకున్నాడు. ఇతరులతో తిరుగుతూ తనను మోసం చేస్తున్నావంటూ ఆమెను నిలదీశాడు. భర్త తన క్యారెక్టర్‌ను అనుమానించడాన్ని తట్టుకోలేకపోయిన శాంతి అతడికి ఎదురుతిరిగింది. నన్నే ప్రశ్నిస్తావా? అంటూ నరేశ్ కోపోద్రిక్తుడై కత్తితో భార్యను పొడిచి చంపేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత తలను వేరేచేసి ఓ డబ్బాలో వేసుకుని సుమారు 5కిలోమీటర్లు నడిచాడు. Also Read: సోమవారం ఉదయం హరిపర్వత్ చౌరస్తాలో అందరూ చూస్తుండగానే డబ్బాలో నుంచి తలను తీసి వేలాడదీసేందుకు ప్రయత్నించాడు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. తన భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నందునే చంపేసినట్లు అతడు పోలీసులకు చెప్పాడు. అయితే కొన్నా్ళ్లుగా నరేశ్‌కు మతిస్థిమితం లేదని కొందరు చెబుతున్నారు. దీంతో అతడి మానసిక స్థితి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తల్లి హత్యకు గురికావడం, తండ్రి జైలుకెళ్లడంతో నలుగురు పిల్లలు అనాథలుగా మారారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2O7ERTw
0 Comments