రూమ్ షేర్ చేసుకుందామని చెప్పి నిద్రలోనే రేప్ చేశాడు

పరీక్ష రాసేందుకు తెలియని ప్రాంతానికి వెళ్లిన యువతి బంధువు చేతిలోనే అత్యాచారానికి గురైన ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లో వెలుగులోకి వచ్చింది. రాత్రిపూట రూమ్‌ షేర్ చేసుకున్న వరుసకు బావ అయ్యే యువకుడు ఆమెను నిద్రలోనే రేప్ చేసి వేధింపులకు గురిచేశాడు. హర్యానాలోని ఓ ప్రాంతానికి చెందిన యువతి పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 22వ తేదీన గురుగ్రామ్‌కు ఒంటరిగా వెళ్లింది. అక్కడ తనకు తెలిసిన వారెవరూ లేకపోవడంతో హోటల్‌లో రూమ్ తీసుకుందామని నిర్ణయించుకుంది. Also Read: దీంతో తనకు వరుసకు బావ అయ్యే యువకుడి సాయం తీసుకోవాలనుకుంది. అతడికి ఫోన్ చేయగా తానుకూడా గురుగ్రామ్‌లోనే ఉన్నానని, కావాలంటే తాను బస చేసిన హోటల్‌ రూమ్‌లోనే ఉండొచ్చని అతడు చెప్పాడు. తనకు వేరే రూమ్ కావాలని, షేర్ చేసుకోవడం తనకిష్టం లేదని యువతి ఎంత చెప్పినా అతడు వినిపించుకోలేదు. ఒక్క రాత్రి కోసం డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటావ్, రాత్రి ఉండి మరుసటి రోజు ఎగ్జామ్‌కి వెళ్లొచ్చు అంటూ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె సరేనని చెప్ప రూమ్‌కి వెళ్లింది. రాత్రి ఇద్దరూ భోజనం చేశాక యువతి నిద్రలోకి జారుకుంది. Also Read: ఇదే సరైన సమయమని భావించిన ఆ యువకుడు ఆమెపై నిద్రలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపై ఏదో బరువు ఉన్నట్లుగా భావించిన యువతి నిద్రలేచి చూడగా యువకుడు కనిపించాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు బాధితురాలు ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. తనను వదిలేయాలని ఆమె ఎంత బతిమాలినా విడిచిపెట్టకుండా అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడు.. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తాని బెదిరించి వెళ్లిపోయాడు. Also Read: దీంతో బాధితురాలు మరుసటి రోజు పరీక్ష రాసేసి ఇంటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల క్రితం యువతి పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు సైక్రియాటిస్ట్‌‌కి చూపించగా ఏదో చూసి బయపడిందని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను నిలదీయగా అత్యాచారం సంగతి చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని శనివారం అదుపులోకి తీసుకున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2O6m4Ix

Post a Comment

0 Comments