Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 26 November 2019

బాబాయి అపర చాణక్యం: వెనక్కువచ్చిన అబ్బాయి.. మంగళవారం ఏం జరిగింది?

ఓవైపు కాంగ్రెస్- ఎన్‌సీపీ- శివసేన కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలు ముగింపు దశకు చేరిన వేళ అనూహ్యంగా సొంత పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పంచన చేరారు. మహారాజకీయాల్లో ఉద్ధండ యోధుడు, సొంత బాబాయి శరద్ పవార్‌ని కాదని బీజేపీకి వత్తాసు పలికి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అజిత్‌ అంతే హడావుడిగా ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే, దీనికి ముందు అనుసరించిన వ్యూహమే ప్రధాన కారణం. బాబాయిగా బంధుత్వం విషయంలో ఆప్యాయతను ఏమాత్రం తగ్గకుండా పవార్ ద్విముఖ వ్యూహం అనుసరించి అజిత్‌‌ను డైలామాలో పడేశారు. చివరకు ఇదే అజిత్‌ ‘రాజీ’నామా చేయడానికి కారణమైంది. అజిత్‌ పవార్‌ రాజీనామాతో బీజేపీ ప్రభుత్వం మూణ్ణాల ముచ్చటయ్యింది. సుప్రీం తీర్పు, పవార్ వ్యూహాంతో బలపరీక్ష జరగాల్సి ఉన్న సమయంలో ఫడ్నవీస్‌ ప్రభుత్వం చెయిత్తేసింది. అజిత్‌ను ఒప్పించి వెనక్కు రప్పించడంతో ఎన్సీపీపై తనకు పూర్తి పట్టు ఉందన్న విషయాన్ని శరద్‌పవార్‌ నిరూపించుకున్నారు. అజిత్‌ బీజేపీతో వెంట వెల్లిన దగ్గర నుంచి ఆచితూచి అడుగులు వేస్తూ ద్విముఖ వ్యూహాన్ని అనుసరించారు. అజిత్‌ చర్యను తాను ఏమాత్రం సమర్థించడం లేదని, బీజేపీకి మద్దతు ఇవ్వడం ఆయన వ్యక్తిగతమే తప్పా పార్టీకి సంబంధం లేదని శరద్‌పవార్‌ తొలి నుంచి స్పష్టం చేస్తూ వచ్చారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని ప్రకటించారు కానీ, అజిత్‌పై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయలేదు. అజిత్ పవార్ నియోజకవర్గం బారామతిలో తనకు అనుకూలంగా వెలిసిన పోస్టర్లను వెంటనే తొలగించేయాలంటూ స్వయంగా శరద్ పవార్ ఆదేశించడం గమనార్హం. ఎన్‌సీపీకి చెందిన జయంత్‌ పాటిల్‌, ఛగన్‌భుజ్‌బల్‌ లాంటి సీనియర్‌ నేతలు రెండురోజుల్లో కనీసం ఆరుసార్లు అజిత్‌తో భేటీ అయ్యారు. అజిత్‌తో ఛగన్‌భుజబల్‌ తదితరులు సోమవారం ఏకంగా నాలుగుగంటల పాటు ఏకాంతంగా సమావేశమై చర్చలు జరిపారు. మరోవైపు శరద్ పవార్ కుమార్తె, సోదరి సుప్రియా సూలేతో పాటూ ఇతర కుటుంబసభ్యులు సోషల్ మీడియా ద్వారా అజిత్‌కు అభ్యర్థనలు చేస్తూనే పోయారు. ‘దాదా’ అంటూ ఎంతో ఆపేక్షగా అన్నయ్యను పిలుచుకునే సుప్రియా సూలే.. అన్నా అధికారం వస్తుంది.. పోతుంది.. బంధాలు శాశ్వతం తిరిగి ఎన్సీపీలోకి వచ్చేయండి అంటూ అజిత్‌ను ఎంతో ఉద్వేగంగా అభ్యర్థించారు. అజిత్ విషక్ష్ంలో శరద్‌పవార్‌ అనుసరించి వైఖరి రెండు రకాలుగా కలిసి వచ్చింది. ఎన్సీపీలో అజిత్‌ను బాగా ఇష్టపడే ఎమ్మెల్యేలు, నేతలు ఉన్నారని శరద్‌పవార్‌కు బాగా తెలుసు. అజిత్‌ పట్ల ఏమాత్రం విద్వేషం ప్రదర్శించినా దాని వల్ల చేటు జరుగుతుందని అంచనా వేసిన పవార్.. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. ఒకవేళ తిరిగి పార్టీలోకి రావాలనుకుంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న భావనను అజిత్‌లోనూ కలిగించగలిగారు. అజిత్ పవార్ బలాలు, బలహీనతల గురించి బాగా తెలిసిన పవార్ తన రాజకీయ వారసుడిగా ఆయననే భావించారు. తన కుమార్తె సుప్రియా సూలే కేవలం జాతీయ రాజకీయాలకే పరిమితమని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదనీ అజిత్‌కు ఎంతగా చెప్పినా ఆయన బీజేపీకి మద్దతు తెలపడం శరద్‌పవార్‌ను షాక్‌కు గురిచేసింది. అయినా సరే నిబ్బరం కోల్పోని పవార్.. చివరకు అజిత్‌ను వెనక్కి రప్పించుకోగలిగారు. మంగళవారం ఉదయమే అజిత్‌కు శరద్‌పవార్‌ అజిత్‌కు ఫోన్‌చేసి మాట్లాడి.. బీజేపీకి మద్దతుపై పునరాలోచించుకోవాలని కోరారు. ఆ తర్వాత ముంబయిలోని ఓ హోటల్‌లో సుప్రియా భర్త సదానంద్‌ సూలేతో అజిత్ సమావేశమయ్యారు. తర్వాత శరద్ భార్య సైతం అజిత్‌తో ఫోన్‌లో మాట్లాడి కుమారుడ్ని ఒప్పించారు. దీంతో ఆయన నేరుగా మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం ‘వర్ష’కు వెళ్లి, అక్కడ జరిగిన బీజేపీ కోర్‌కమిటీలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం అజిత్‌ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Dh0DPU

No comments:

Post a Comment