వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ప్రియురాలి భర్త చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రవి.. భార్య, కుమారుడితో కలిసి కొన్నాళ్ల క్రితం వలస వచ్చి కొత్తపేటలో నివాసముంటున్నాడు. రవి భార్యకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచనూరు గ్రామానికి చెందిన కె.ప్రణీత్‌రెడ్డి(24) చిన్ననాటి స్నేహితుడు. Also read: అతడు వ్యక్తిగత పనుల నిమిత్తం అప్పుడప్పుడు నగరానికి వచ్చి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. రవి ఇంట్లో లేని సమయంలో ప్రణీత్‌రెడ్ది వచ్చి ఆమెతో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ విషయం తెలుసుకున్న రవి వారిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు ప్లాన్ వేశాడు. సోమవారం పనికి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతడి భార్య ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది. Also read: వారిద్దరూ బెడ్‌రూమ్‌లో రాసలీలల్లో మునిగితేలిన సమయంలో రవి ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్యను, మూడేళ్ల కొడుకును బయటకు పంపి ప్రణీత్‌రెడ్డి తలపై కర్రతో బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో అతడు అక్కడిక్కడే చనిపోవడంతో రవి నేరుగా చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. Also read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34Rhog7
0 Comments