5 రోజుల సజీవ సమాధి సాధన.. చివరకు..!

రాష్ట్రంలో ఓ వ్యక్తి తనకు మానవాతీత శక్తులు ఉన్నాయని నమ్మించేందుకు చేసిన ప్రయోగం విషాదాంతమైంది. మహాసముంద్‌ జిల్లా పచరీ గ్రామంలో సమాధిలో సాధన చేస్తానంటూ రంగంలోకి దిగిన ఓ యువకుడు చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గత ఐదేళ్లుగా ఆ యువకుడు ఇలాంటి ప్రమాదకర సాధన ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రతీసారి మరణపు అంచుల వెళ్లి వచ్చే యువకుడు ఐదో ప్రయత్నం మాత్రం మృత్యువును జయించలేక పోయారు. Also Read: చమన్‌దాస్ జోషి (30) అనే యువకుడు మొదటి ఏడాది 24 గంటలు, రెండో ఏడాది 48 గంటలు, మూడో ఏడాది 72 గంటలు, నాలుగో ఏడాది 96 గంటల పాటు సజీవ సమాధి సాధన చేస్తూ వచ్చాడు. గత నాలుగు దఫాల్లో సమాధిలో నుంచి స్పృహ లేని స్థితిలో అతనిని బయటకు తీసుకు వచ్చారు. ఐదోసారి 108 గంటల పాటు సమాధిలో ఉంటానంటూ ప్రతినబూనాడు . ఇందుకోసం డిసెంబర్ 16న నాలుగు అడుగుల లోతైన గొయ్యి తవ్వాడు. తెల్లని వస్త్రం ధరించి, పూజలు చేసిన అనంతరం సమాధిలో కూర్చున్నాడు. తర్వాత తన అనుచరుతో ఆ గొయ్యిని కర్రలతో మూసివేసి, దానిపై బురదపూశారు. Also Read: తిరిగి జోషి చెప్పిన సమయానికి అంటే డిసెంబర్ 20న మధ్యాహ్నం 12 గంటల సమయానికి స్థానికులు సమాధిని తెరిచారు. అయితే లోపల జోషి ఎప్పటి మాదిరిగానే అచేతన స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే అతనిని మహాసముంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు జోషిని పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. దీంతో వారు అదే సమాధిలో మృతదేహాన్ని ఖననం చేశారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2SezTrM

Post a Comment

0 Comments