వివాహితను లొంగదీసుకునేందుకు ఆమె రెండేళ్ల కుమారుడిని అపహరించాడో ప్రబుద్ధుడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ్ పూజన్ పండిట్ అనే వ్యక్తి రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వలస వచ్చి నాజఫ్‌గర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతడు స్థానికంగా ఉండే ఓ వివాహితపై పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రపన్నిన శివ్.. బుధవారం ఆమె రెండేళ్ల కుమారుడిని అపహరించాడు. Also Read: అనంతరం గురువారం బాధితురాలికి నిందితుడు ఫోన్ చేసి బాలుడు తనతో ఉన్నాడని.. బాబు కావాలంటే తన వద్దకు రావాలని డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. దీంతో బాధితురాలు జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసింది. అనంతరం పోలీసులు ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. రాజస్థాన్‌లో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు. నిందితుడు శివ్ పూజన్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు విచారణలో తేలింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/35N6QiV
0 Comments