ఆస్ట్రేలియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియాకు చెందిన నవ దంపతులు దుర్మరణం చెందారు. మృతులు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలోని వెంగోలకు చెందిన అల్బిన్ టీ మాథ్యూస్ (30), నిను సుసెన్ ఏల్ధో (28) దంపతులుగా గుర్తించారు. వీరికి ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీన వివాహమైంది. నిను ఆస్ట్రేలియాలో నర్సుగా పని చేస్తోంది. దీంతో పెళ్లి తర్వాత నవంబర్ 20న అల్బిన్, నిను దంపతులు వెళ్లారు. Also Read: ఈ నేపథ్యంలో న్యూ సౌత్‌వేల్స్‌లో భారతీయ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 6 గంటలకు వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికాగా, ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. వెంగోలలోని వలసాల తొంబర హౌజ్‌కు చెందిన అల్బిన్ తండ్రి మాథ్యూస్ ఎస్ఐగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. కొత్తమంగళంలోని సరమ్మ పుతుమనక్కుడియిల్ హౌజ్‌కు చెందిన నిను తండ్రి ఏల్ధో రిటైర్డ్ ఎల్ఐసీ ఆఫీసర్. నవ దంపతుల మృతితో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2tAtWv0
0 Comments