రంగారెడ్డి జిల్లాలో రెండు ప్రేమజంటల ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. తమ ప్రేమకు పెద్దలు అడ్డు చెప్పడంతో రెండు జంటలు వేర్వేరు ప్రాంతాలో ఆత్మహత్యకు పాల్పడ్డాయి. షాబాద్‌ మండలం లింగారెడ్డి గూడలో ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపంతో ప్రేమికులు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. Also Read: లింగారెడ్డి గూడ గ్రామానికి చెందిన పల్లవి (19), ఆశమల్ల మహేందర్‌ (21) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే అంగీకరించరేమోనని తీవ్ర మనస్తాపానికి గురైన వారిద్దరూ గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read: మరో ఘటనలో ప్రేమపెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న ఆవేదనతో కేశంపేట మండలం తొమ్మిది రేకుల గ్రామానికి చెందిన సుశీల(20) అనే యువతి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు రాములు(25) పొలంలో ఉరేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ రెండు ప్రేమజంటల క్షణికావేశం నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2q77Xui

Post a Comment

0 Comments