అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన నైట్‌క్లబ్‌పై మధ్యప్రదేశ్‌లోని పోలీసులు దాడులు చేశారు. ఇండోర్ నగరానికి చెందిన జితేందర్ సోని ‘సంజ లోక్ స్వామి’ పేరిట ఈవినింగ్ న్యూస్‌పేపర్‌తో పాటు నైట్ క్లబ్ నిర్వహిస్తున్నాడు. అయితే అతడి క్లబ్‌పై అనేక ఆరోపణలు రావడంతో పోలీసులు పత్రికా కార్యాలయంతో పాటు నైట్ క్లబ్‌పై పోలీసులు ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా 67 మంది బార్ డాన్సర్లను కాపాడి మహిళా సదనానికి తరలించారు. Also Read: జితేందర్ అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి అనేక మంది మహిళలను ఇండోర్ తీసుకువచ్చి వారిని బలవంతంగా బార్ డాన్సర్లుగా మార్చినట్లు ఆరోపణలున్నాయి. వీరిలో చాలామందితో వ్యభిచారం కూడా చేయిస్తున్నట్లు తెలుస్తోంది. దాడి సందర్భంగా పోలీసులు క్లబ్‌లో లైవ్ బుల్లెట్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. జితేందర్ ఇంట్లోని రెండు బీరువాలను సీజ్ చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 370 (మానవ అక్రమ రవాణా నివారణ), ఆయుధ చట్టం కింద రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. Also Read: అయితే దాడుల విషయం తెలుసుకున్న నిందితుడు జితేందర్ పరారీలో ఉండటంతో అతడి కుమారుడు అమిత్ సోనీని అరెస్ట్ చేసినట్లు ఇండోర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ రుచివర్ధన్ మిశ్రా చెప్పారు. ఈ కేసుకు సంబంధించి సంజ లోక్‌స్వామి పత్రికా కార్యాలయాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2DxrzLp
0 Comments