మహిళల ఎదుట వికృత చేష్టలు.. కూకట్‌పల్లిలో ఆకతాయికి దేహశుద్ధి

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళల పట్ట అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆకతాయికి స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. అడ్డగుట్ట సొసైటీ జలవాయువిహార్ కాలనీలో ఉదయాన్నే శివాలయానికి వెళ్లి వస్తున్న మహిళలతో అసభ్యంగా ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించసాగాడు. వారిని రోడ్డుపైనే అడ్డగిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. Also Read: ఇదే క్రమంలో కలిసి వెళ్తున్న ఇద్దరు మహిళలను అడ్డగించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఓ మహిళ తన భర్తకు ఫోన్ చేయడంతో అతడు వెంటనే అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి ఆకతాయిని చితకబాదాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. తన పేరు రాజు అని, మేస్త్రీ పని చేస్తుంటానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. యూసుఫ్‌గూడ నుంచి కూకట్‌పల్లికి సినిమా చూసేందుకు వచ్చి దారి తప్పానని తెలిపాడు. Also Read: పోలీసులు అడిగే ప్రశ్నలకు అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అతడిని ఇంకా విచారిస్తున్నారు. ఓ వైపు దిశ హత్య ఘటనతో భాగ్యనగరం మొత్తం ఆవేదనలో మునిగిపోతే.. మరోవైపు ఇలాంటి మృగాళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. వరుస ఘటనలతో ప్రజల్లో ఇప్పటికే ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆకతాయిల ఆగడాలు ఇంకా పెరిగిపోవడంతో ప్రజలు ఆవేదన చెందుతున్నారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33Dre4p

Post a Comment

0 Comments