రాష్ట్రంలోని జిల్లాలో హాస్టల్‌లో ఉంటున్న నలుగురు డిగ్రీ విద్యార్థినులు దాల్చడం సంచలనం రేపుతోంది. ట్రైబల్ హస్టల్‌లో ఉంటూ గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో చదివే విద్యార్థినులు గర్భం దాల్చారు. దీంతో హస్టల్ సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొద్ది రోజులుగా 10 మంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం కాకపోవడంతో అనుమానం వచ్చి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. Also Read: దీంతో ముగ్గురు గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. అలాగే మరో విద్యార్థిని మూడు నెలల గర్భవతిగా తేల్చారు. అయితే ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా ఉంచింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థినులు గర్భం దాల్చిన విషయం వాస్తవమేనని ప్రిన్సిపాల్ నిర్ధారించారు. దీంతో ఈ ఘటనపై శనివారం ఆర్‌సీఓ లక్ష్మయ్య బాధిత విద్యార్థినులతో పాటు ఏఎన్‌ఎం, ప్రిన్సిపాల్, జిల్లా గిరిజన అధికారుల సమక్షంలో విద్యార్థినుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కాగా, రెండు నెలల క్రితమే వసతి గృహంలో ఓ విద్యార్థిని గర్భం దాల్చినట్లు స్థానిక వైద్య సిబ్బంది గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒకేసారి నలుగురు విద్యార్థినులు గర్భవతులుగా తేలడం సంచలనం రేపింది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2F0Yetm
No comments:
Post a Comment