Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 27 December 2019

‘ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీలతో పెద్ద నోట్ల రద్దు కంటే ఎక్కువ నష్టం’

పౌరసత్వ సవరణ చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌర పట్టికలను ఉద్దేశించి నేత మరోసారి విమర్శలు గుప్పించారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతు.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. , ఎన్ఆర్సీల వల్ల పెద్ద నోట్ల రద్దుకంటే పెను నష్టం కలుగుతుందని దుయ్యబట్టారు. ఈ ప్రక్రియ మూలంగా దేశంలోని పేదలందరినీ మీరు భారతీయులేనా? కాదా? అనే పరిస్థితి ఉత్పన్నమవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ప్రధాని 15 మంది స్నేహితులు ఎలాంటి పత్రాలను చూపించకుండానే జేబులు నింపుకుంటున్నారని, ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో కేవలం ఆ పదిహేను మంది పెట్టుబడుదారులకే ప్రయోజనం కలిగిందని రాహుల్ ధ్వజమెత్తారు. ఎన్‌పీఆర్, ఎన్ఆర్సీల వల్ల ప్రజలకు పెద్ద నోట్ల రద్దు కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని , దాని కంటే రెండు రెట్లు అధికంగా ప్రభావం చూపుతుందని అన్నారు. ఎన్పీఆర్‌ను ఏప్రిల్ 2020 నుంచి సెప్టెంబరు 30 మధ్య చేపడతారు. ఇందులో భాగంగా మీది సొంతిల్లా? అద్దె ఇల్లా? ఎన్ని గదులున్నాయి, స్నానాల గదులెన్ని.. మరుగుదొడ్లు పడకగదులతో కలిపి ఉన్నాయా లేక బయటా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఇలాంటి 34 ప్రశ్నలకు ప్రతి కుటుంబం సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. పదేళ్ల తరువాత చేపట్టబోతున్న జనగణన కోసం ప్రతి కుటుంబం నుంచి సేకరించాల్సిన వివరాల కోసం కేంద్ర జనగణన శాఖ ప్రశ్నావళిని సిద్ధం చేసింది. వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం కాదు. దేశంలో నిర్మించిన ప్రతి కట్టడం, అందులో నివసించే కుటుంబం వివరాలను నమోదు చేయనున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Q26TSM

No comments:

Post a Comment