దందా కొత్తపుంతలు తొక్కుతోంది. ఆన్‌లైన్ ద్వారా వీరి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. సైబర్ ఆర్థిక నేరాలకు పాల్పడే ముఠాల ఆగడాలను అరికట్టడానికి సతమతమవుతున్న పోలీసులకు మరో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కాల్‌గర్ల్స్ పేరుతో ప్రకటనలు ఇస్తూ అమాయకులను బెదిరించి దోపిడీలకు పాల్పడే వందలాది ముఠాలు రాష్ట్ర వ్యాప్తంగా చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ మోసాలకు పాల్పడే వారిలో అధిక శాతం బయటి రాష్ట్రాలకు చెందినవారు కావడంతో వీరి ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. Also Read: అడ్డాగా మసాజ్ పార్లర్లు..కర్ణాటకలోని ప్రముఖ నగరాల్లో అనేక మసాజ్ పార్లర్లు ఆన్‌లైన్ వేశ్యావాటికలకు అడ్డాగా మారాయి. ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లను ఆకర్షించి మసాజ్ పార్లర్లకు రప్పించుకుని ఆన్‌లైన్‌లో చెప్పిన ధర కంటే అధికంగా డబ్బు వసూలు చేస్తున్నారు. కర్ణాటకలోని సగానికి పైగా మసాజ్ పార్లర్లు ఆన్‌లైన్ వేశ్యవాటిక దందాలకు అడ్డాగా మారుతున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్ దేశం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన మహిళలను అక్రమంగా బెంగళూరుకు రప్పించి వేశ్యా వృత్తిలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కేసుల్లో అరెస్టయిన వారికి కోర్టుల్లో సులభంగా బెయిల్ లభిస్తోంది. దీంతో వారు మళ్లీ బయటకు వచ్చి దందాలకు పాల్పడుతున్నారు. , మంగళూరు, మైసూరు, హుబ్లీ- ధార్వాడ, బెళగావి, బళ్లారి, దావణగెరె నగరాల్లో ఆన్‌లైన్ వేశ్యవాటిక దందా కార్యకలాపాలు పెచ్చుమీరాయి. వెబ్‌సైట్ల ద్వారా దందా..కొన్ని వెబ్‌సైట్లలో ఇళ్లు, స్థలాల విక్రయాలు, హోటళ్లలో వసతి, విహారయాత్రలు, వాహనాలు వంటి సమాచారం ఉచితంగా లభిస్తుంది. ఈ వెబ్‌సైట్లలోకి హనీట్రాప్ ముఠాలు చొరబడి కర్ణాటకలోని ప్రముఖ నగరాల్లో యువతులు అందుబాటులో ఉన్నారని ప్రకటనలు ఇస్తారు. ఎవరైనా కస్టమర్లు ఈ నంబర్‌కు ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు నిండా మునిగినట్లే. నంబర్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడి దోపిడీకి పాల్పడుతాయి. Also Read: కేసులు కూడా భారీగానే.. ఆన్‌లైన్‌లో కాల్‌గర్ల్స్ ఫొటోలు చూపించి అక్కడే నగదు జమచేయాలని సూచిస్తారు. దీన్ని నమ్మి వారి అకౌంట్‌కు నగదు జమచేస్తే తక్షణమే ఫోన్ స్విచ్ఛాఫ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా నగదు చెల్లించేందుకు నిరాకరిస్తే వారిని తమ వద్దకు పిలిపించి వారికి కాల్‌గర్ల్స్‌ను చూపిస్తామని తీసుకెళ్తారు. డబ్బుతో వచ్చిన వారిని మార్గం మధ్యంలో అడ్డుకుని దాడికి పాల్పడి నగదు లాక్కుని ఉడాయిస్తారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందనే భయంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఆన్‌లైన్ సెక్స్ రాకెట్‌కు సంబంధించి 2017లో కర్ణాటకలో 295 కేసులు, 2018లో 218 కేసులు నమోదయ్యాయి. 2019 మార్చి వరకు 74 కేసులు నమోదయ్యాయి. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2stizEX
No comments:
Post a Comment