Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday 4 February 2020

భారత్‌కు షాకిచ్చిన భూటాన్.. దశాబ్దాల ‘ఉచితానికి’ ఇక మంగళం

మనకు పొరుగున ఉన్న అత్యంత నమ్మకమైన మిత్ర దేశం అనే సంగతి తెలిసిందే. 2014లో భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ చేపట్టిన తొలి విదేశీ పర్యటన భూటాన్. రక్షణ, విదేశీ వ్యవహారాల్లో మన దేశం భూటాన్‌కు సహకారం అందిస్తోంది. చైనా టిబెట్‌ను ఆక్రమించుకోవడంతో.. దానికి సమీపంలో ఉన్న బుల్లి దేశమైన భూటాన్ భయపడింది. దీంతో ఆ దేశం భారత్‌కు మరింత దగ్గరైంది. చైనా ఎంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా సరే.. భూటాన్ మాత్రం భారత్‌నే విశ్వసిస్తోంది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను నెరిపేందుకు భూటాన్ సుముఖంగా లేదు. 2017లో భారత్, భూటాన్, చైనా సరిహ్దదుల్లోని డోక్లాంలోకి చైనా బలగాలు దూసుకొచ్చి తిష్ట వేసినప్పుడు.. భారత సైన్యం 72 రోజులపాటు వాటికి ఎదురు నిలిచింది. భూటాన్‌కు మద్దతుగా భారత్ చైనాను ఎదురించింది. అంతటి మిత్ర దేశమైనా భూటాన్‌.. భారత పర్యాటకులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. దశాబ్దాలుగా భారత పర్యాటకులకు తమ దేశంలోకి ఉచిత ప్రవేశ సదుపాయాన్ని కల్పిస్తోంది. కానీ తాజాగా భారత పర్యాటకులకు ఉచిత ప్రవేశాన్ని భూటాన్ రద్దు చేసింది. సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్డీఎఫ్) పేరిట భారత్‌తోపాటు బంగ్లాదేశ్, మాల్దీవుల నుంచి వస్తోన్న పర్యాటకుల నుంచి రూ.1200 (17 డాలర్లు) వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూలై నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. భూటాన్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య భారీగా పెరగడంతో.. వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం కోసం, ఆదాయం పెంచుకోవడం కోసం భూటాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కానీ మిగతా దేశాల పర్యాటకుల నుంచి ఎస్డీఎఫ్ రూపంలో 65 డాలర్లతోపాటు ఫ్లాట్ ఛార్జీగా రోజుకు 250 డాలర్లు వసూలు చేస్తుండగా... భారత పర్యాటకుల నుంచి 17 డాలర్లను మాత్రమే వసూలు చేస్తామని తెలిపింది. భారత పర్యాటకులు ఎక్కువగా భూటాన్‌లో అభివృద్ధి చెందిన పశ్చిమ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఇవి భారత ప్రధాన భూభాగానికి దగ్గరగా ఉంటాయి. భూటాన్‌లో మొత్తం 20 జిల్లాలు ఉండగా తూర్పున ఉన్న 11 జిల్లాలను సందర్శించే భారతీయుల దగ్గర ఎస్డీఎఫ్ వసూలు చేయబోమని భూటాన్ తెలిపింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/31oLfw7

No comments:

Post a Comment