Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 4 February 2020

జగిత్యాలలో కాల్పుల కలకలం.. భార్యను తుపాకీతో కాల్చి..

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై తుపాకీతో కాల్పులు జరిపిన సంఘటన జగిత్యాలలో కలకలం రేపింది. ఆ ఘటనలో భార్య బంధువుకు తీవ్రగాయాలయ్యాయి. రెండు బుల్లెట్లు శరీరంలో నుంచి దూసుకెళ్లాయి. ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజుపల్లికి చెందిన గీతికకు మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన శ్రీనివాస్‌తో కొద్దికాలం కిందట వివాహమైంది. కొద్దిరోజులు సాఫీగా సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో విసుగుచెందిన గీతికి పుట్టింటికి వెళ్లిపోయింది. Also Read: ఈ నేపథ్యంలో శ్రీనివాస్ నిన్న అర్ధరాత్రి సమయంలో ఇస్రాజుపల్లి వెళ్లి భార్య గీతికతో గొడవకు దిగాడు. వివాదం ముదరడంతో ఆగ్రహానికి లోనైన శ్రీనివాస్ తుపాకీతో గీతికపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గీతిక మేనమామ రాజిరెడ్డి అడ్డుపడడంతో తీవ్రగాయాలయ్యాయి. ఒక బుల్లెట్ రాజిరెడ్డి కడుపులో నుంచి.. మరోటి చేతిలో నుంచి దూసుకెళ్లాయి. Read Also: కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన రాజిరెడ్డిని హుటాహుటిన జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంగనర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాల్పుల ఘటనపై డీఎస్పీ వెంకటరమణ విచారణ చేపట్టారు. సంఘటన పై ఆరా తీస్తున్నారు. శ్రీనివాస్‌ మాజీ మావోయిస్టుగా తెలుస్తోంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3bchvXy

No comments:

Post a Comment